అందరూ ఇష్టపడుతున్నది ఆమెనే!

Shruti Hassanశ్రుతీహాసన్ తన తోటి కథానాయికలందరికీ షాక్ ఇచ్చారు. ‘దక్షిణాదిన అందరూ అత్యంత ఇష్టపడుతున్న హీరోయిన్ ఎవరు?’ అనే అంశంపై ఓ ప్రముఖ మీడియా సంస్థ నిర్వహించిన సర్వేలో ప్రస్తుతం ఉన్న హీరోయిన్లందర్నీ వెనక్కు నెట్టి ఆమె మొదటి స్థానంలో నిలిచారు. బళ్లు ఓడలు అవ్వడం… అంటే ఇదే. గతంలో శ్రుతీహాసన్ పేరెత్తితే చాలు ‘ఐరన్‌లెగ్’ అనేవారు. అలాంటి హీరోయిన్ ఇలాంటి క్రెడిట్ సాధించడం నిజంగా విశేషమే. గబ్బర్‌సింగ్, ఎవడు, బలుపు, రేసుగుర్రం… ఇలా వరుసగా విజయాలను అందుకుంటూ తెలుగు సినీరంగంలో దూసుకుపోతున్నారు శ్రుతి.

నిజానికి, గత ఏడాది ఇదే సంస్థ నిర్వహించిన సర్వేలో 11వ స్థానంలో ఉన్నారు శ్రుతీహాసన్. ఇప్పుడిలా ప్రేక్షకాదరణలో ప్రథమ స్థానం పొందడాన్ని బట్టి… శ్రుతి కెరీర్ స్పీడ్ ఏ రేంజ్‌లో ఉందో ఊహించుకోవచ్చు. పెద్దగా విజయాలు లేకపోయినా తమన్నా ఈ సర్వేలో రెండోస్థానంలో నిలవడం విశేషం. శ్రీయ, ఇలియానా, హన్సిక, నయనతార, కాజల్ టాప్ టెన్‌లో స్థానం సంపాదించుకోగా, ప్రస్తుతం తెలుగులో నంబర్‌వన్ హీరోయిన్‌గా భాసిల్లుతున్న సమంత 12వ స్థానంతో సరిపెట్టుకోవడం గమనార్హం. ఏది ఏమైనా ఈ సర్వేలో నంబర్‌వన్‌గా నిలిచినందుకు శ్రుతి చెప్పలేనంత ఆనందంతో ఉన్నారు.
 

Leave a Comment