అక్తర్ వయసు 39.. అమ్మాయి వయసు 17

1కరాచీ: ప్రపంచంలోనే వేగవంతమైన ఫాస్ట్ బౌలర్లలో ఒకడిగా.. అభిమానులు రావల్పిండి ఎక్స్ప్రెస్గా పిలుచుకునే పాకిస్థాన్ మాజీ క్రికెటర్ షోయబ్ అక్తర్ లేటు వయసులో ఓ ఇంటివాడు కాబోతున్నాడు. అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైరయిన 39 ఏళ్ల షోయబ్ ఓ టీనేజ్ బాలికను వివాహం చేసుకోబోతున్నట్టు పాకిస్థాన్ మీడియాలో కథనాలు ప్రచురితమయ్యాయి. అతని కంటే ఆ అమ్మాయి వయసులో 21 ఏళ్లు చిన్నది.

హరిపూర్ జిల్లాకు చెందిన వ్యాపారవేత్త ముస్తక్ ఖాన్ కుమార్తె 17 ఏళ్ల రుబబ్తో షోయబ్ పెళ్లి నిశ్చయమైంది. ఇరు కుటుంబాల పెద్దల అంగీకారంతో ఈ నెల మూడో వారంలో వివాహం జరగనుంది. గతేడాది ఇరు కుటుంబాలు తొలిసారి కలసినట్టు సమాచారం. 19, 20, 22 తేదీల్లో వివాహ కార్యక్రమాలు జరగనున్నట్టు పాకిస్థాన్ పత్రిక వెల్లడించింది. కాగా రుబబ్కు క్రికెట్ అంటే పెద్దగా ఆసక్తి లేదట.

Leave a Comment