అలాస్కాలో భూకంపం, సునామీ హెచ్చరిక!

US Geological Surveyలాస్ ఎంజెలెస్: ఆలాస్కా తీరప్రాంతాన్ని భూప్రకంపనలు కుదిపేసాయి. అలాస్కాలో భూప్రకంపనలు రిక్టర్ స్కేల్ పై 8 పాయింట్లుగా నమోదు కాగా.. స్థానికంగా సునామీ హెచ్చరికలు జారీ చేసినట్టు యూఎస్ జియోలాజికల్ సర్వే వెల్లడించింది.
అయితే తమ వద్ద ఉన్న సమాచారం మేరకు ప్రమాదకరమైన సునామీ సూచనలు కనిపించడం లేదని పసిఫిక్ సునామీ వార్నింగ్ సెంటర్ వెల్లడించింది. అంతేకాక హవాయికి కూడా ఇప్పటికిప్పుడు వచ్చిన ముప్పేమి లేదని వెల్లడించింది.
లిటిల్ సిట్ కిన్ ఐలాండ్ మారుమూల ప్రాంతంలోని 24 కిలో మీటర్ల దూరంలో అక్కడి కాలమానం ప్రకారం 8.53 నిమిషాలకు భూకంపం సంభవించినట్టు తెలుస్తోంది. వెస్టర్న్ ఆలూషియన్స్ ప్రాంతంలోని నికోల్స్ స్కీ, ఉమ్నాక్ ఐలాండ్ నుంచి అట్టు ఐలాండ్ వరకు ఈ ప్రభావం ఉంటుందని ది నేషనల్ సునామీ వార్నింగ్ సెంటర్ తెలిపింది. ఈ ప్రాంతాల్లో సునామీ సంభవిస్తే అనేక గంటలపాటు ఈ ప్రభావం ఉంటుందని వార్నింగ్ సెంటర్ హెచ్చరించింది.

Leave a Comment