ఆంధ్రప్రదేశ్ పోలీసుల దర్యాప్తులో తప్పులుంటే NIA నిరూపించాలి…టీడీపీ సవాల్!

ప్రతిపక్ష నాయకుడు జగన్ పైన జరిగిన కత్తి దాడి పంచాయితీ దిల్లికి చేరింది.  జాతీయ భద్రతా సంస్థ (NIA) దర్యాప్తు చేపట్టనున్నట్లు చేసిన అధికారిక ధృవీకరణతో,..బిజెపి-టిడిపి తెగదెంపుల అనంతరం రోజురోజుకూ క్షీణిస్తున్న కేంద్ర-రాష్ట్ర సంబంధాలు ఇప్పుడు బాహాబాహీ తలపడే సన్నివేశానికి చేరినట్లు కనిపిస్తున్నాయి!

విభజన హామీలు కాంగ్రెస్ కనిపారేసిన అనాధలు కాబట్టి కమలనాధ కధలకి ఆంధ్రులు గంగిరెద్దుల్లా తలలూపుతారని భావించిన బి‌జే‌పి ఆంధ్రప్రదేశ్ లో తమ ఎన్నికల సన్నాహకాలకు తెర లేపాలని తలపోసింది.

దీనికి ట్రయల్ రన్ అన్నట్లు,..పద్దెనిమిదేళ్లుగా పచ్చిబూతులు పలికిన కెసిఆర్ ఆంధ్రకి వచ్చి ఆంధ్రుల స్పందన ఏమిటో ఫీడ్ బ్యాక్ తీసుకున్నాడు. “మొఖాన ఊసినా పోరు” అన్న నోటితోనే అన్నం తింటానని ఆంధ్రకి వస్తే ఆంధ్రులు అన్నీ పెట్టి పంపించటంతో మోడి కూడా అదే వరుసలో జనవరి 6 నుండి ఆంధ్రప్రదేశ్ లో 4 ప్రాంతాల పర్యటన అంటూ తయారైపోయాడు!

అయితే, కెసిఆర్ ని ఉపేక్షించినట్లు చంద్రబాబు తనని తేలికగా వదిలేది లేదని తెలుగుదేశం తలపెట్టిన విభజన హామీల నిలదీత సభలతో అర్ధమవ్వటంతో,..మోడి తనకు తానుగా పెట్టుకున్న పర్యటన పరీక్ష నుండి పక్కకు తప్పుకున్నాడు!

ఈ పరిణామాలు అవమానంగా స్వీకరించిన కమల కార్యాలయాలు బదులుగా ఇప్పటికే రాష్ట్రంలో ముఖ్యమంత్రి పర్యటనలను ఆటంకపరిచే కార్యాచరణకు దిగాయి.

దేశపు అతి శక్తివంత న్యాయ సంస్థ సిబిఐ ని దుర్వినియోగం చేశారనే అంతర్గత కలహాలు రచ్చకెక్కటంతో రాష్ట్రాల నిర్ణయాధికారాన్ని ఉపయోగించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం CBI ని తిరస్కరించటం వల్లే ఇప్పుడు, తాజాగా NIA ని కూడా రాజకీయ ప్రతీకారాల కోసం రాష్ట్రాల పైకి ప్రయోగిస్తున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ పోలీస్ వారు అయిర్ పోర్ట్ ల భద్రత ఏవియేషన్ డిపార్ట్మెంట్ చూసుకుంటుంది అని చెప్పిన రోజున కేంద్ర సంస్థలు ముందుకు రాకుండా, 2 నెలలు దాటిపోయాక ఇప్పుడు హఠాత్తుగా సివిల్ ఏవియేషన్ యాక్ట్ నామస్మరణకి దిగటం ఈ ఉదంతంలో ప్రస్తావనార్హం!

అయితే, కారణాలు కారకులు ఎలా ఉన్నా అంతః కలహాలు రాష్ట్రాల హద్దులు దాటి, ప్రత్యర్ధి మీద పైచేయి కోసం రాష్ట్ర ఉనికిని అస్థిరపరచటం ఇప్పుడు ఒక్కసారి మొదలైతే భవిష్యత్తులో భస్మాసురహస్తంగా అవతరించకపోదు. అంతిమంగా, రాష్ట్రాలపైన ఈ తరహా చట్ట సంస్థల దుర్వినియోగం దేశ విచ్చినానికి దారి తీస్తుంది,..అదే జరిగితే, ఇప్పుడు అధికారం కోసం ఈ విషప్రయోగం చేసేవాళ్ళు రేపు పరాయి దేశస్తుల మోచేతి నీళ్ళు తాగక తప్పదు…

ఆంధ్రప్రదేశ్ పోలీసుల దర్యాప్తులో తప్పులుంటే NIA నిరూపించాలి…టీడీపీ సవాల్!

Posted by Telugu Vaartha on Sunday, January 6, 2019

విజయవాడ జిల్లా పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశం సందర్భంగా తెలుగుదేశం రాష్ట్ర  కార్యనిర్వాహక కార్యదర్శి గొట్టిపాటి రామకృష్ణ ప్రసాద్ మాట్లాడుతూ “విమానాల హైజాక్, ఉగ్రవాద కార్యకలాపాలపైన ఉపయోగించే ఏవియేషన్ చట్టాన్ని దుర్వినియోగం చేస్తూ రాష్ట్రాల హక్కులను బీజేపీ కాలరాస్తోంది. ఒక వైపు రాష్ట్ర హైకోర్ట్ లో ఈ కేస్ వాయిదా 4 వ తారీఖున ఉంటే, 31 వ తారీఖున ప్రధాన మంత్రి కార్యాలయం ఆఘమేఘాల మీద జాతీయ భద్రతా సంస్థకి ఆదేశాలు ఇవ్వటం బీజేపీ-వైసీపీ అక్రమ సంబంథానికి సాక్ష్యం. మావోయిస్ట్ లు చేసిన అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు హత్య NIA పరిధిలో ఉన్నా కూడా, నెలల తరబడి స్పందించకుండా కాలయాపన చేసిన కేంద్రం ఈ కేస్ లో మాత్రం జగన్ మీద ప్రేమతో  అత్యుత్సాహం చూపిస్తోంది. కేంద్ర రాష్ట్రాల ఫెడరల్ స్ఫూర్తిని కాలరాస్తున్న బీజేపీ తీరుని మేము నిరసిస్తూ కేంద్రానికి లేఖ రాస్తాము,. అప్పటికీ పతిస్థితి మారకపోతే తదుపరి కార్యాచరణ ఏమిటో ఆలోచిస్తాము” అన్నారు.

 

Leave a Comment