ఆంధ్ర హక్కుల కోసం రాష్ట్రస్థాయి బంద్…

ప్రత్యేక హోదా విభజన హామీల కోసం వచ్చే పార్లమెంట్ సమావేశాల సమయంలోఆంధ్ర ప్రదేశ్ కు జరిగిన అన్యాయాన్ని దేశం ముందుకు తెచ్చేలా వేలాది మందితోAP బంద్ తలపెడుతున్నట్లు సమితి నాయకులు ప్రకటించారు.

 

ఢిల్లీలో ఆంధ్ర హక్కుల కోసం శాంతియుతంగా నిరసన తెలుపుతున్న ఆంధ్రుల మీద మోడీ అమానుషంగా లాఠీచార్జ్ చేయించి నెత్తురోడేలా గాయపరిచటాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా విభజన హామీల సాధన సమితి అధ్యక్షులు చలసాని శ్రీనివాస్ తీవ్రంగా ఖండించారు.

“ఆ లాఠీచార్జ్ లో తీవ్రంగా గాయపడిన 11 మంది ఆంధ్రులను డిల్లీ, రామ్మనోహర్ లోహియా ఆసుపత్రిలో చికిత్సకు చేర్పించవలసి వచ్చింది. బి‌జే‌పి ఆంధ్రకి ప్రత్యేక హోదా ఇవ్వము అని – కాంగ్రెస్ తామొస్తే ఇస్తాము అంటున్న నేపధ్యంలో ఎన్నికల వరకూ ఈ అంశాన్ని లేవనెత్తుతూనే ఉంటాము. అరుణ్ జైట్లీ, రాజ్నాధ్ సింగ్ అంతా మోడి చేతిలోనే ఉంది మేమేమి చేయలేము అంటున్నారు. కేంద్రంలో ఉన్న్ బి‌జే‌పి ప్రభుత్వం ఒక్క ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ద్వారా కొన్ని గంటల్లో ప్రత్యేక హోదా ఇవ్వవచ్చు! 75 వేల కోట్లు రాష్ట్రానికి రావలసి ఉండగా పోలవరానికి, రాజధానికి, ప్రత్యేకహోదాకి చెందిన నిధులు ఇచ్చేశామని దుర్మార్గంగా వాదిస్తున్నారు. రాయలసీమా కి ఇవ్వాల్సిన వేల కోట్ల నిధులు ఇవ్వకుండా రాయలసీమ వెనుకబడింది అంటూ విభజనవాదాన్ని సృష్టిస్తున్నారు.  బి‌జే‌పి నాయకులు ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఐక్యతతో లేరు అనే భ్రమలో ఉన్నారు.” అంటూ ఆయన మండి పడ్డారు. “అన్ని పార్టీలను కలుపుకుని వెళతామని, పార్టీలకు అతీతంగా ప్రాంతం ప్రజల కోసం నిస్వార్ధంగా చేసే హోదా ఉద్యమంలో అన్ని పక్షాలు స్వప్రయోజనాలను  పక్కనపెట్టి కలిసిరావాలని చలసాని శ్రీనివాస్ పిలుపునిచ్చారు.

పగిలిన కుండలు, పగిలిన పిడతలతోమోడీకి స్వాగతం….

ప్రత్యేక హోదావిభజన హామీల  సాధన సమితి

యువజన విద్యార్థులు మిగిలిన అన్ని వర్గాలతో బయలుదేరి.. ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ప్రాంగణంలో బహిరంగ సభ జరిపేందుక, పార్లమెంట్ లో ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టే సమయంలో రాష్ట్ర జాతీయ రహదారి సరిహద్దుల వద్ద 24 గంటల బంద్ చేయాలని, రైలు పట్టాలపై రాష్ట్ర సరిహద్దుల్ వద్ద మరియు కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల నిర్బంధం, అఖిల పక్షం BJP మినహా మిగిలిన రాజకీయ పార్టీలతోను, సంఘాలతోనూ చర్చించి కార్యాచరణ తేదీలను ప్రకటిస్తామని,.. అందుకు సమాజంలోని అన్ని వర్గాలు కలిసి రావాలని ప్రత్యేక హోదా విభజన హక్కుల సాధన సమితి అధ్యక్ష కార్యదర్శులు చలసాని శ్రీనివాస్ , K రామకృష్ణ కోరారు.

 

ఈ సమావేశంలో

TDP రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వర్ల రామయ్య మాట్లాడుతూ,.. పార్టీలకు అతీతంగా మీరు చేసే పోరాటానికి మేము పూర్తి మద్దతు ఇస్తామని తెలిపారు.

అనంతరం, సమితి ప్రతినిధులు ఖాళీ కుండలు ముంతలను సభా వేదిక వద్దే పగలకొట్టి హోదా ఇవ్వకపోతే మోడీని బొంద పెట్టవలసి వస్తుందని హెచ్చరించారు.

ఈ సమావేశంలో పాల్గొని ప్రసంగించి పూర్తి మద్దతు పలికిన వారిలో… టీడీపీ MLC బుద్దా వెంకన్న, TNSF రాష్ట్ర అధ్యక్షుడు బ్రహ్మం చౌదరి, సీపీఐ నాయకులు, NGOs అధ్యక్షుడు చంద్రశేఖర్ రెడ్డి, జనరల్ సెక్రెటరీ బండ్ల శ్రీను, AP టీచర్స్ ఫెడరేషన్ ప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు, ఆమ్ ఆద్మీ నాయకులు, లోక్ సత్తా నాయకులు, ఆంధ్రప్రదేశ్ జర్నలిస్ట్ ఫోరమ్ అధ్యక్షుడు కృష్ణాంజనేయులు, సీపీఐ నాయకులు, PDSU ప్రతినిధులు, AP హక్కుల సమితి నాయకులు, విద్యార్థి నాయకులు అనేక మంది ప్రముఖులు పాల్గొన్నారు.

 

JNTUC, NGOs సంఘాలు AP టీచర్స్ ఫెడరేష్, ఇండియన్ ముస్లిమ్ పార్టీ మరియు అనేక ప్రజా సంఘాలు పాల్గొని ఆంధ్ర హక్కుల సాధన ఉద్యమానికి పూర్తి మద్దతు తెలిపాయి.

Leave a Comment