ఆకాశంలో తారాజువ్వల్లా..

నింగిలో తారాజువ్వల్లా దూసుకుపోతున్న వీరు అమెరికాలోని ఒహియోకు చెందిన ఫాస్ట్రాక్స్ అనే స్కై డైవింగ్ బృంద సభ్యులు. విమానంలోంచి ప్యారాచూట్ వేసుకుని స్కై డైవింగ్ చాలా మంది చేస్తారు. అయితే, వీరు మరో అడుగు ముందుకేసి.. తమ కాళ్లకు ఫైర్ వర్క్స్ కట్టుకుని దూకుతారు. దీన్ని పైరోటెక్నిక్ స్కై డైవింగ్ అంటారు. చూడ్డానికి ఈజీగా కనిపించినా.. ఇందులో ఎంతో ప్రమాదముందని చెబుతారు ఫాస్ట్రాక్స్ సభ్యులు. ముందుగా వీరు దూకేది.. రాత్రి సమయంలో.. పైగా.. నిప్పురవ్వలు 3 వేల డిగ్రీల ఫారన్‌హీట్ వేడిని ఉత్పత్తి చేస్తాయి. ఏ మాత్రం ఏమరుపాటుగా ఉన్నా.. నిప్పురవ్వలతో ప్యారాచూట్ అంటుకునే ప్రమాదముంటుంది. అందుకే.. స్కై డైవింగ్‌లో కనీసం 2 వే ల జంప్‌లు పూర్తి చేసిన వారినే..  పైరోటెక్నిక్ స్కై డైవింగ్ చేయడానికి అనుమతిస్తారు.

Leave a Comment