ఆలస్యంగా వెలుగుచూసిన దారుణం

rapeసిద్ధార్థనగర్: ఉత్తరప్రదేశ్ కు చెందిన 16 ఏళ్ల బాలికను అపహరించి, సామూహిక అత్యాచారం చేసి… నేపాల్ లో ఆమెను అమ్మేసేందుకు ప్రయత్నించిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. ఈ కేసుకు సంబంధించి ఇద్దరు దుండగులను పోలీసులు అరెస్ట్ చేశారు. విజయపాల్, అతని మేనల్లుడు చింకు.. ఎత్వా ప్రాంతం నుంచి బాలికను అపహరించి నేపాల్ కు తీసుకెళ్లారు. ఈ క్రమంలో ఆమెపై 20 రోజుల పాటు వారు అత్యాచారానికి పాల్పడ్డారు.

చింకు తండ్రి తకావు, బరాన్సి అనే వ్యక్తితో కలిసి బాలికను మరొకరికి విక్రయించేందుకు ప్రయత్నించారు. వీరి బారి నుంచి తప్పించుకున్న బాలిక పోలీసులను ఆశ్రయించడంతో ఈ దారుణం వెలుగుచూసింది. విజయపాల్, చింకులను అరెస్ట్ చేసినట్టు పోలీసులు తెలిపారు. మరో ఇద్దరు నిందితులను పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నట్టు చెప్పారు.

Leave a Comment