ఎన్నారై టి.అర్.యస్ – యూకే నూతన కార్యవర్గం

తెలంగాణ రాష్ట్ర సమితి ఎన్నారై  (ఎన్నారై టి.అర్.యస్ సెల్ – యూకే) నూతన కార్యవర్గాన్నిఅధ్యక్షులు శ్రీ అనిల్ కూర్మాచలం ప్రకటించారు.
ఆరు సంవత్సరాల క్రితం లండన్ లో టి. ఆర్. యస్ జెండా ఎగరవేసి తెలంగాణ ఉద్యమంలో, తెలంగాణ రాష్ట్ర సాధన లో క్రియాశీలక పాత్ర పోషించి ఖండాంతరాల్లో కెసిఆర్  గారి నాయకత్వాన్ని బలపర్చుతూ, నేడు బంగారు తెలంగాణ నిర్మాణం లో పార్టీ వెన్నంటే ఉండి ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తూ దిగ్విజయం గా ముందుకు వెళ్తున్నామని అనిల్ కూర్మాచలం తెలిపారు.
anil-kurmachalam
లండన్ వేదికగా ప్రారంభమైన ఎన్నారై శాఖ, ప్రపంచవ్యాప్తంగా ఎన్నో ఇతర దేశాల శాఖలకు స్పూర్తినివ్వడమే కాకుండా, వారి ఏర్పాటుకు క్రియాశీలక పాత్ర పోషించిందని, అన్ని సందర్బాల్లో మేమంత కలిసి పార్టీ అభివృద్దికి కృషి చేస్తామని తెలిపారు.
క్రమశిక్షణ కలిగిన కార్యకర్తలుగా, ప్రవాస తెలంగాణా బిడ్డలకు(సంస్థలకు)  – పార్టీ కి /ప్రభుత్వానికి వారధులుగా పని చేస్తామని, మాకు ఈ అవకాశం కల్పించిన కే. సీ. ఆర్ గారికి,   ప్రత్యేకించి  మమ్మల్ని ప్రోత్సహిస్తున్న ఎంపీ కవిత గారికి, మరియు యావత్ టి. ఆర్. యస్ పార్టీ నాయకులకు – క్షేత్రస్థాయి కార్యకర్తలకు, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఎన్నారై టి. ఆర్. యస్ ప్రతినిదులకు, ముఖ్యంగా ఎన్నారై టి. ఆర్. యస్ – అమెరికా నాయకుడు మహేష్ తన్నీరు గారికి  ఎన్నారై టి. ఆర్. యస్ సెల్  తరుపున కృతజ్ఞతలు తెలిపారు.
అలాగే నూతన కార్యవర్గ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు.
నూతన కార్యవర్గ వివరాలు :
అధ్యక్షుడు – అనిల్ కూర్మాచలం, ఉపాద్యక్షులు అశోక్ గౌడ్ దూసరి, నవీన్ రెడ్డి, శ్రీకాంత్ పెద్డిరాజు, ప్రధాన కార్యదర్శి – రత్నాకర్ కడుదుల, సలహా మండలి  బోర్డ్ ఛైర్మన్ గా పోచారం సురేందర్ రెడ్డి, వైస్ ఛైర్మన్ గా దొంతుల వెంకట్ రెడ్డి, సలహా మండలి సభ్యులుగా ప్రవీణ్ కుమార్ వీర, సత్యం కంది, యూకే & యురోప్ ఇన్‌ఛార్జ్ గా విక్రమ్ రెడ్డి రేకుల, కార్యదర్శులుగా సృజన్ రెడ్డి చాడా మరియు శ్రీధర్ రావు తక్కలపెల్లి,  సంయుక్త కార్యదర్శులుగా సంజయ్ సెరు మరియు మల్లా రెడ్డి బీరమ్, అధికార ప్రతి నిధులుగా హరి గౌడ్ నవపేట్ (యూకే), సృజన్ రెడ్డి చాడా (యూకే),  రమేశ్ ఎశంపల్లి(యూకే), రాజ్‌కుమార్ శాణబోియన (ఇండియా), సునీల్ రెడ్డి మంద(ఇండియా),  లండన్ ఇన్‌ఛార్జ్ సతీష్ రెడ్డి బండ, కోశాధికారిగా మధుసూధన్ రెడ్డి, మీడియా -పి.ఆర్.ఒ గా శ్రీకాంత్ జెల్ల, ఐటీ – కార్యదర్శి వినయ్ ఆకుల , సంక్షేమ కార్యక్రమాల -ఇన్‌ఛార్జ్ రాజేష్ వర్మ, మెంబర్షిప్ ఇన్‌ఛార్జ్ రాకేశ్ రెడ్డి కీసర, ఇవెంట్స్ ఇన్‌ఛార్జ్ లుగా  శ్రీనివాస్ కలకూంట్ల మరియు సత్య పింగిళి,  ఇవెంట్స్ కో – ఆర్డినే టార్స్ గా సత్య చిలుమల, హరికృష్ణ ఉప్పల, రవి ప్రదీప్ పులుసు మరియు నవీన్ భువనగిరి, ఈస్ట్ లండన్ ఇన్‌ఛార్జ్లు గా రమేశ్ ఎశంపల్లి మరియు నవీన్ మాదిరెడ్డి, వెస్ట్ లండన్ ఇన్‌ఛార్జ్ లుగా గణేశ్ పస్తమ్ మరియు సురేష్ బుడగం,  ఎగ్జిక్యూటివ్ సభ్యులుగా చిత్తరంజన్ రెడ్డి తంగేళ్ల, భరత్ బాశెట్టి మరియు రవి కుమార్ రాతినేని, ఇండియా కో- ఆర్డినేటర్ లు గా మల్లేష్ పప్పుల, ప్రవీణ్ కుమార్ పంతులు, సుభాష్ కుమార్, పొన్నోజు రాజేష్ మరియు ఆక్రం పాష శేఖ్  ప్రకటించారు.

Leave a Comment