ఏ రాష్ట్రానికి ముఖ్యమంత్రిని అవుతానో..

తెలుగుదేశం యువ నేత లోకేష్ తాను తెలంగాణకు ముఖ్యమంత్రి ని అవుతానా?లేక ఆంద్రప్రదేశ్ కు ముఖ్యమంత్రిని అవుతానా అన్నది కాలమే తేల్చుతుందని వ్యాఖ్యానించడం విశేషం.ఒక ఆంగ్లపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ వ్యాఖ్యలుచేశారు.తాను ఆంద్ర కాదు..తెలంగాణ కాదు..హైదరాబాదీని అని ఆయన అన్నారు. ఇక్కడ ఓటు హక్కు కలిగిన వ్యక్తిగా తనకు ఇక్కడి ప్రభుత్వంపై విమర్శలు చేసే హక్కు ఉంటుందని అన్నారు.తెలంగాణలో పార్టీకి చాలామంది సీనియర్ నాయకులు ఉన్నారని, తాను ముఖ్యమంత్రి అవుతానని అనుకోవడం లేదని ,అలాగే ఆంద్రప్రదేశ్ లో మరో దశాబ్దం పాటు చంద్రబాబు నాయుడే ముఖ్యమంత్రిగా ఉంటారని అన్నారు.అయితే ముఖ్యమంత్రి అయ్యే అవకాశం వస్తే తెలంగాణలో అవుతారా?ఎపి కి ముఖ్యమంత్రి అవుతారా అని అడిగితే లోకేష్ సమాధానం చెబుతూ ఇది చాలా వివాదాస్పదమైన ప్రశ్న అని, ఇందుకు కాలమే సమాధానం చెబుతుందని ఆయన అన్నారు. తన తండ్రి చంద్రబాబు నాయుడు ఇంటి వద్ద మాత్రమే డాడి అని, బయట మాత్రం నాయకుడేనని ఆయన వ్యాఖ్యానించారు.

Leave a Comment