కలకలం సృష్టించిన రెండు ప్రేమ జంటలు ….

గుంటూరు జిల్లా బాపట్లలో రెండు ప్రేమ జంటలు  ఆత్మహత్యాయత్నించి కలకలం సృష్టించాయి.  ప్రత్యూష, దుర్గ అనే విద్యార్థినులను గోపిరెడ్డి,శివసత్యనారాయణలు ప్రేమించారు. ఆడపిల్లలు ఇద్దరూ ఇంటర్ చదువుతున్నారు.  వారి పెళ్లికి పెద్దలు అంగీకరించరన్న అనుమానంతో కలిసి చనిపోవాలని నలుగురూ అనుకున్నారు. బాపట్ల శివారులోకి వెళ్లి నలుగురూ పురుగుల మందు తాగారు. ఇది గమనించిన స్థానికులు బాపట్ల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కాగా ప్రత్యూష, దుర్గ ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.

Leave a Comment