కాజల్ నిర్మాతలఫై సెటైర్లు వేస్తుందంట…!

కాజ02-10-20141412221566kajal-agarwal-hot-veera-stills-004[8]ల్ మళ్ళీ తనపారితోషిక విషయంలో విచిత్రమైన కామెంట్స్ చేసి మీడియాకు హాట్ టాపిక్ గా మారింది. ‘గోవిందుడు అందరివాడేలే’ సినిమాలో తన లుక్ కు మంచి ప్రశంసలు వస్తున్న నేపధ్యంలో కాజల్ మంచి జోష్ మీద ఉంటూ ఆ హుషారులో నిర్మాతల పై సెటైర్లు వేసింది. దక్షిణాది సినిమాలలో నటిస్తున్న హీరోయిన్స్ కు బాలీవుడ్ హీరోయిన్స్ కు ఇస్తున్న పారితోషికంతో పోలిస్తే తక్కువే కదా అంటోంది కాజల్ అగర్వాల్. తమిళం, తెలుగు, హిందీ భాషల లలో సినిమాలు చేస్తూ బిజీగా ఉన్న కాజల్ తన పారితోషికం విషయంలో నిర్మాతలు కళ్లు బైర్లు కమ్మే స్థాయిలో పారితోషికం డిమాండ్ చేస్తోందనే ప్రచారం ఉంది.

 

ఈ పారితోషిక సమస్య వల్లే కాజల్ అగర్వాల్ తమిళంలో ‘జిల్లా’ చిత్రం తరువాత మరో చిత్రం చేయలేదు. త్వరలో బాలాజి మోహన్ దర్శకత్వంలో ఒక చిత్రం చేయబోతోంది. టాలీవుడ్ లో జూనియర్ సరసన లేటెస్ట్ సినిమాలో నటిస్తోంది. బాలీవుడ్ లో కూడా రెండు సినిమాలు చేస్తోంది. తన పారితోషిక విషయంలో మీడియాతో మాట్లాడుతూ పారితోషికం అనేది వారి వారి మార్కెట్‌ను బట్టి నిర్ణయిస్తారని అంటూ తాను కూడా అదే విధంగా పారితోషికం తీసుకుంటున్నానని అంటోంది. వాస్తవానికి కోటి,కోటిన్నర అన్నది సాధారణ పారితోషికమే అంటూ బాలీవుడ్ హీరోయిన్ల కంటే తాను తీసుకుంటున్న పారితోషికం చాలా తక్కువే కదా అని ఎదురు ప్రశ్నలు వేసింది కాజల్.

 

ఈ సందర్భంలో మరో అడుగు ముందుకు వేసి తమ వృత్తి చాలా ప్రమాదకరమైందని అంటూ దుస్తులకే చాలా ఖర్చు చేయాల్సి ఉంటుందని, అదీకాక ఆదాయపు పన్ను చెల్లిస్తున్నామని కూడా తాను చేస్తున్న దేశ సేవ గురించి చెప్పుకొచ్చింది కాజల్. వాస్తవంగా చెప్పాలి అంటే తాను అడిగిన పారితోషికం ఏ నిర్మాత ఇవ్వడం లేదని అందుకే తాను సద్దుకు పోతున్నానని నిర్మాతల పై సెటైర్లు వేసింది కాజల్.

Leave a Comment