కూతురు కోసం మడోన్నా ప్రీ-ప్రోమ్ పార్టీ!

pre-promన్యూయార్క్: తన టీనేజ్ కూతురు లార్డెస్ కోసం ‘ప్రీ-ప్రోమ్’ పార్టీని పాప్ స్టార్ మడోన్నా ఇటీవల ఏర్పాటు చేశారు. అమెరికాలో హై స్కూల్ విద్య పూర్తయిన తర్వాత ఇలాంటి పార్టీని ఏర్పాటు చేస్తారు.  జూన్ 21 తేదిన న్యూయార్క్ సిటీలో ఏర్పాటు చేసిన గార్డెన్ పార్టీలో కూతురుతోపాటు స్నేహితులు పాల్గొన్నారు.
ప్రీ ప్రోమ్ పార్టీ నిర్వహించాం. లార్డెస్ స్నేహితులు హాజరయ్యారు అని ట్విటర్ లో పోస్ట్ చేశారు. తన కూతురు కోసం ఏర్పాటు చేసిన విందు ఏర్పాట్లను మడొన్నా దగ్గరుండి చూసుకున్నారు. హైస్కూల్ విద్యను పూర్తి చేసుకున్న లార్డెస్… ఫిరెల్లో హెచ్. లాగార్డియా హైస్కూల్ ఆఫ్ మ్యూజిక్ అండ్ ఆర్ట్స్ లో గ్రాడ్యుయేషన్ చేసేందుకు సిద్దమయ్యారు.

Leave a Comment