క్షమాపణ చెప్పిన పవన్ కళ్యాణ్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఏం చేసినా, అందుకు ఓ అర్ధం ఉంటుంది. ఇదే పవనిజం ని నమ్ముకున్న వారికి అర్ధమైయ్యే సూక్తి. ఇదిలా ఉంటే పవన్ కళ్యాణ్ ఇంత కాలం ఆలస్యం చేసుకుంటూ వచ్చిన గబ్బర్ సింగ్2 మూవీ షూటింగ్, త్వరలోనే సెట్స్ మీదకు వెళ్ళనుంది. ఇప్పుడు గబ్బర్ సింగ్2 మూవీ ఓ సరికొత్త కథతో తెరపైకి రాబోతుంది. దాదాపు గబ్బర్ సింగ్ 2 మూవీ కథను రి-డిజైన్ చేయడం, సరికొత్త స్టోరి లైన్ ని ఇందులో పెట్టడం వంటి ఎన్నో విషయాలు జరిగాయాయి. గబ్బర్ సింగ్ 2 మూవీ అనేది ఇప్పుడు షూటింగ్ కి సిద్ధంగా ఉన్న మూవీ. గతంలో ఈ మూవీ షూటింగ్ కి ఆసక్తి చూపని పవన్ కళ్యాణ్, ఇప్పుడు మూవీ షూటింగ్ కోసమే ఎదురుచూస్తున్నాడు. గబ్బర్ సింగ్2 మూవీ షూటింగ్ ని త్వరగా పూర్తి చేయటానికి, అలాగే ప్రమోషన్ చేసుకోవాటానికి తన డేట్స్ ని అన్నింటికి ఒక్కసారిగా ఇచ్చేశాడు. అంతే కాకుండా చిత్ర యూనిట్ తో గబ్బర్ సింగ్2 మూవీ అనేది కచ్ఛితంగా బాక్సాపీస్ ఫ్రాఫిట్ మూవీగా మారుతుంది అంటూ చెప్పుకొచ్చాడట. పవన్ కళ్యాణ్ ఈ విధంగా తను నటించబోతున్న మూవీ గురించి చెబుతూ, ఇంత కాలం మూవీ ఆలస్యానికి కారణం అయినందుకు కూడ తన వంతుగా క్షమాపణ చెప్పుకున్నాడట. పవన్ కళ్యాణ్ ఈ విధంగా ఓ ఉధ్వేగ భరితమైన మాటలు చెబుతుండటంతో, చిత్రయూనిట్ ఇంత కాలం ఈ మూవీ కోసం వెయిట్ చేసిన అసహం ఒక్కసారిగా తుడిచిపెట్టుకుపోయింది. చాలా మంది టెక్నిషియన్స్, ఈ మూవీ కోసం చాలా ఆఫర్స్ ని వదులుకొని ఎంతో కాలంగా వెయిట్ చేస్తున్నారంట. అందుకే గబ్బర్ సింగ్2 మూవీ షూటింగ్ పాజిటివ్ హోప్స్ తోనూ, ఉత్సాహంగానూ ముందుకు సాగటానికి పవన్ కళ్యాణ్ ఈ విధంగా చిత్ర యూనిట్ ని ఉద్ధేశించి మాట్లాడి ఉండవచ్చని అంటున్నారు.

Leave a Comment