ఖమ్మం చేరుకున్న కిరణ్ మృతదేహం

Kiranహైదరాబాద్: హిమాచల్ ప్రదేశ్ బియాస్ నదినీటి ప్రవాహంలో ఈ నెల 8వ తేది ఆదివారం  కొట్టుకుపోయిన ఎం.కిరణ్ కుమార్ మృతదేహం ఖమ్మం చేరుకుంది. మృతదేహాన్ని హిమాచల్ ప్రదేశ్ నుంచి  ప్రత్యేక విమానంలో సోమవారం మధ్యాహ్నం హైదరాబాద్‌ తీసుకు వచ్చారు. ఇక్కడ నుంచి సాయంత్రానికి ఖమ్మంలోని బుర్హాన్‌పురంలో ఉన్న స్వగృహానికి తరలించారు. కిరణ్ మృతదేహానికి ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్యేలు బోనోత్ మదన్‌లాల్‌, పువ్వాడ అజయ్‌ కుమార్లు నివాళులర్పించారు. చేతికి అందివచ్చిన కొడుకు దుర్మరణం చెందడంతో కిరణ్  తల్లి పద్మావతి, తండ్రి వెంకటరమణ బోరున విలపిస్తున్నారు.

తమ కుమారుడు బతికి ఉండే అవకాశం లేదని, కడసారి చూపు కోసం కిరణ్ తండ్రి వెంకటరమణ,  మేనమామ నరసింహారావు  హిమాచల్ ప్రదేశ్‌ వెళ్లారు. తండ్రి తిరిగి వచ్చారు. నరసింహారావు మాత్రం అక్కడ ఉండి కిరణ్ కోసం ఎదురు చూడసాగారు.   ఆదివారం మధ్యాహ్నం కిరణ్ మృతదేహం నదిలో లభించింది. మృతదేహం దొరికిన సమయంలో దుస్తులను చూసిన నరసింహారావు ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. కాసేపటి తర్వాత తేరుకుని ఇది తన మేనల్లుడి మృతదేహమేనని రోదిస్తూ ధ్రువీకరించారు.  ఇండియన్ ఎయిర్‌లైన్స్‌లో పనిచేసి ఉద్యోగ విరమణ చేసిన నరసింహారావు హైదరాబాద్‌లోని బీహెచ్‌ఈఎల్‌లో నివాసం ఉంటున్నారు. కిరణ్ ఆయన వద్దనే ఉంటూ ఇంజనీరింగ్ చదువుతున్నాడు.

బియాస్ నదినీటి ప్రవాహంలో 24 మంది విద్యార్థులు కొట్టుకుపోయిన విషయం తెలిసిందే. వారిలో ఆరుగురు విద్యార్థినులు, 18 మంది విద్యార్థులు ఉన్నారు. హైదరాబాద్‌లోని విజ్ఞానజ్యోతి కళాశాల విద్యార్థులు లార్జి డ్యామ్‌లో దిగిన సమయంలో గేట్లు ఎత్తివేయడంతో  ఒక్కసారిగా పెరిగిన ప్రవాహ ఉధృతికి విద్యార్థులు కొట్టుకుపోయారు. ఇప్పటి వరకు 17 మృతదేహాలు మాత్రమే లభ్యమయ్యాయి. ఇంకా ఏడు మృతదేహాలు కనిపించలేదు.

బియాస్ నదిలో గల్లంతయినవారు:
1.దాసరి శ్రీనిధి
2.కాసర్ల రిషిత రెడ్డి
3. గంపల ఐశ్యర్య
4. లక్ష్మీగాయత్రి
5.ఆకుల విజేత
6. రిథిమ పాపాని

7.కల్లూరి శ్రీహర్ష
8. దేవాశిష్ బోస్
9. బైరినేని రిత్విక్
10. ఆషిష్ మంత
11.సందీప్ బస్వరాజ్
12.అరవింద్
13.పరమేష్
14. జగదీష్ ముదిరాజ్
15. అఖిల్-మిట్టపల్లి
16. ఉపేందర్
17.అఖిల్-మాచర్ల
18.భానోతు రాంబాబు
19. శివప్రకాష్ వర్మ
20. ఎం.విష్ణువర్ధన్
21.సాయిరాజ్
22.సాబేర్ హుస్సేన్
23. కిరణ్ కుమార్
24. పి.వెంకట దుర్గ తరుణ్

ఇప్పటివరకు దొరికిన మృతదేహాలు:

1. గంపల ఐశ్యర్య
2. ఆకుల విజేత
3 భానోతు రాంబాబు
4.లక్ష్మీగాయత్రి
5. దేవాశిష్ బోస్
6. షాబేర్ హుస్సేన్
7. టి.ఉపేందర్
8.అరవింద్ కుమార్
9.పి.వెంకట దుర్గ తరుణ్
10.అశీష్ ముంతా,
11.మాచర్ల అఖిల్‌
12.శివప్రకాశ్ వర్మ
13.మహెన్ సాయిరాజ్‌
14.పరమేష్
15. రినేని రిత్విక్
16.ఎం.కిరణ్ కుమార్
17.మిట్టపల్లి అఖిల్

Leave a Comment