గవర్నర్ ప్రసంగమా… సంతాప తీర్మానమా: వైఎస్ఆర్ సీపీ

YSR Congress party MLAsహైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉభయ సభలలో గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ చేసిన ప్రసంగంపై వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేలు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. గవర్నర్ ప్రసంగమా లేక సంతాప తీర్మానమా అంటూ ఎద్దేవా చేశారు. గవర్నర్ ప్రసంగంపై శనివారం హైదరాబాద్లో వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేలు జ్యోతుల నెహ్రు, శ్రీకాంత్ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, రోజా మాట్లాడారు. నరసింహన్ ప్రభుత్వ కరపత్రం చదవి రాష్ట్ర ప్రజలను తీవ్ర నిరాశకు గురి చేశారని ఆరోపించారు. విడిపోయిన రాష్ట్రంలో సంతాప సభలో మాట్లాడినట్లు గవర్నర్ ప్రసంగం ఉందని విమర్శించారు.

గవర్నర్ తన ప్రసంగంతో ప్రజలకు మనోధైర్యం ఇవ్వలేకపోవడమే కాకుండా రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజల ఆశలను నీరుగార్చారన్నారు. బీఏసీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రాధాన్యత కల్పించకపోతే ఆ సమావేశం నుంచి బహిష్కరిస్తామని వారు స్పష్టం చేశారు. గవర్నర్ ప్రసంగం ఆసాంతం ప్రజలను ఆశల పల్లకిలో ఊరేగించినట్లు ఉందన్నారు. ఆంధ్ర రాష్ట్రానికి అన్యాయం జరిగిందని మళ్లీ ప్రజలను మభ్యపెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేలు జ్యోతుల నెహ్రు, శ్రీకాంత్ రెడ్డి, శ్రీధర్ రెడ్డి, రోజాలు విమర్శించారు.

Leave a Comment