గోవిందుడి షూటింగ్ మళ్ళీనా!

రామ్ చరణ్ ‘గోవి౦దుదు అందరివాడేలే’ సినిమాకు మళ్ళీ రిపీట్ ఆడియన్స్ ను రప్పించే ఉద్దేశ్యంతో ఒక పాటను ఈ సినిమా విడుదల అయ్యాక కొంత గ్యాప్ తీసుకుని కలుపుతారు అనే గాసిప్స్ గతoలోనే వచ్చాయి. అయితే ఆ వార్తలను నిజం చేస్తూ మరో పాటను జత చేసేందుకు ఈ చిత్ర యూనిట్ సిద్ధమైంది అనే వార్తలు వస్తున్నాయి. ఈ నేపధ్యంలో చిత్ర యూనిట్ దసరా పండుగకు సెలవు కూడా తీసుకోకుండా ఒక పాటను చిత్రీకరించటంలో నిమగ్నమైంది అనే వార్తల హడావిడి మొదలైంది. రామ్ చరణ్ ఈ పాట చిత్రీకరణ కోసం దసరా పండుగను కుడా వదులుకుని షూటింగ్ లో పనిచేయబోతున్నాడట. ఈపాట చిత్రీకరణ పూర్తయ్యేవరకూ ఎలాంటి బ్రేక్ తీసుకోకుండా పనిచేయాలని చరణ్ నిశ్చయించు కున్నాడు అని టాక్. అమెరికాలో మొన్న జరిగిన ప్రీమియర్ షోల కోసం చరణ్ అమెరికా వెళ్ళడానికి అన్ని ఏర్పాట్లు చేసుకున్నా ఈ పాటను వీలైనంత త్వరలో ఈ సినిమాకు కలపాలి అన్న ఉద్దేశంతో చరణ్ తన అమెరికా ప్రయాణాన్ని వాయిదా వేసుకున్నట్లుగా తెలుస్తోంది.  చరణ్ తన దసరా సరదాలను కూడా త్యాగం చేసి హడావిడిగా చేస్తున్న ఈపాట ఈ సినిమాకు ఎంతవరకు రిపీట్ ఆడియన్స్ ను రప్పిస్తుందో చూడాలి.

Leave a Comment