చంద్రబాబు ‘మేక్ ఆంధ్రప్రదేశ్’ పర్యటనలు!

ప్రధాని నరేంద్ర మోడీ ‘మేక్ ఇన్ ఇండియా’ నినాదం అద్భుత ఫలితాలవ్వడం ప్రారంభించి దేశంలోని పలువురిని ఆకర్షిస్తోంది. ఆ ప్రభావం నేపథ్యంలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడైతే, మోడీ తరహాలోనే ఏకంగా విదేశీ పర్యటనలకూ 02-10-20141412220267BL04_CHANDRU_2091782fసిద్ధమైపోయారు. ‘మేక్ ఆంధ్రప్రదేశ్’ పేరిట ఆయన జరపనున్న విదేశీ పర్యటనల పరంపర వచ్చే రెండు నెలల కాలంలో ప్రారంభం కానుంది. కేవలం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులే లక్ష్యంగా విదేశాలు చుట్టి రానున్న చంద్రబాబు, ఇప్పటి నుంచే అందుకు తగ్గ ప్రణాళికలకు పదును పెడుతున్నారు. తన పర్యటనల్లో భాగంగా ఆయా కంపెనీల అధిపతులతో భేటీ కావడమే కాక, ఏపీలో ఏ తరహా సౌకర్యాలు అందించనున్నారు, ఏ మేరకు రాయితీలు అందనున్నాయన్న విషయాలపై ఆయన రోడ్డు షోలు నిర్వహించేందుకు కూడా సిద్ధపడుతున్నట్లు సమాచారం. తన పర్యటనల్లో భాగంగా చంద్రబాబు చైనా, జపాన్, సింగపూర్, మలేసియా తదితర దేశాల్లో తొలిదశ పర్యటన జరపనున్నారు. దీనిపై అధికార బృందం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. వచ్చే ఏడాది ఏప్రిల్, మే నెలల్లో మొదలు కానున్న రెండో దశ పర్యటనల్లో భాగంగా చంద్రబాబు అమెరికాలో పర్యటించనున్నట్లు సమాచారం. మరి మోడీలాగే చంద్రబాబు కూడా తాననుకున్న మేర లక్ష్యాన్ని చేరతారని ఆశిద్దాం.

Leave a Comment