చేతగాని ప్రభుత్వం

రాష్ట్రంలో నిరంతర విద్యుత్ కోతలున్నట్లు టీడీపీ నేత రేవంత్ రెడ్డి తెలిపారు. ముందు చూపులేకపోవడం వల్లే విద్యుత్ సమస్య తలెత్తినట్లు పేర్కొన్నారు .రాష్ట్రంలో పంటలు ఎండిపోయి రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారన్నారు. అనుభవం ఉన్న ఐఏఎస్ అధికారులను బదిలీ చేసి పదవీ విరమణ పొందిన అధికారులను తీసుకొచ్చారని ఎద్దేవా చేసారు.  రాష్ట్రానికి  300 మెగావాట్ల విద్యుత్ ఇస్తామని ఏపీ మంత్రి దేవినేని ఉమ ప్రతిపాదిస్తే… ఇంతవరకు టీఆర్ఎస్ ప్రభుత్వం కనీసం స్పందించలేదని ఆరోపించారు తెలంగాణ ప్రభుత్వం విద్యుత్ శాఖ మంత్రిని కూడా నియమించడం లేదన్నారు.. సమస్యల నుంచి తప్పించుకునేందుకు చంద్రబాబుపై విమర్శలు చేస్తున్నారని తెలిపారు. ఇంత చేతగాని ప్రభుత్వాన్ని తాను ఇంతవరకు చూడలేదని రేవంత్ ఎద్దేవా చేశారు.
నల్గొండ జిల్లాలో టీడీపీ కార్యాలయంపై టీఆర్ఎస్ శ్రేణులు దాడి చేయడంపై  రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతు సమస్యలను పరిష్కరించడం చేతగాకే… ప్రజలను పక్కదారి పట్టించేందుకు టీడీపీపై టీఆర్ఎస్ దాడి చేస్తోందని మండి పడ్డారు

Leave a Comment