ఛాన్స్ మిస్ అయిన మహేష్…!

‘పోకిరి’తో ఇండస్ట్రీ రికార్డ్‌ సాధించిన మహేష్‌బాబు ఆ తర్వాత దూకుడు, బిజినెస్‌మేన్‌, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టులాంటి హిట్‌ చిత్రాల్లో నటించాడు కానీ మళ్లీ నంబర్‌వన్‌ హిట్‌ని మాత్రం అందుకోలేకపోయాడు. వరుసగా మూడు 01-10-201414121591801-Nenokkadineవిజయాలు సాధించిన అనంతరం మహేష్‌ ‘1 నేనొక్కడినే’తో నంబర్‌వన్‌ అనిపించేసుకుంటాడని ఫాన్స్‌ ఆశించారు.  అయితే తెలుగు ప్రేక్షకుల అభిరుచికి సరిపడని సినిమాతో మహేష్‌ ఆ చిత్రంతో పరాజయం చవిచూసాడు. అయినప్పటికీ అతని మలి చిత్రం ‘ఆగడు’పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. దూకుడు కాంబినేషన్‌కి తోడు పక్కా కమర్షియల్‌ సినిమా అనిపించే లుక్‌తో ఆగడు చాలా పెద్ద హిట్‌ అవుతుందని అనుకున్నారు. మహేష్‌ రియల్‌ స్టామినా ఏంటనేది ఈ చిత్రంతో తెలిసిపోతుందని అంచనా వేసారు.  కానీ అనూహ్య పరాజయంతో మహేష్‌బాబుని డిఫెన్స్‌లో పడేసింది ఆగడు.

 

ఈమధ్య కాలంలో రిలీజ్‌కి ముందు ఇంత హైప్‌ వచ్చిన సినిమా ఇంకోటి లేదు. టాక్‌ పాజిటివ్‌గా వచ్చి ఉంటే ఆకాశమే హద్దు అయ్యేది. కానీ బ్యాడ్‌ టాక్‌ రావడంతో హై ఎక్స్‌పెక్టేషన్స్‌ ఉన్న సినిమా నాలుగో రోజుకే చతికిల పడిరది. ఓవర్సీస్‌తో సహా అన్ని చోట్ల లాస్‌ వెంఛర్‌ అయిన ‘ఆగడు’ పరాజయాన్ని మరిపించి… మళ్లీ రేసులో ముందుకి రావాలంటే మహేష్‌ తన తదుపరి చిత్రంతో భారీ హిట్‌ కొట్టి తీరాలి. మహేష్‌కి మర్చిపోలేని విజయాన్ని ‘మిర్చి’ శివ అందిస్తాడో లేదో చూడాలి.

Leave a Comment