ట్విట్టర్లో షారుక్ ఖాన్ @ 80 లక్షలు

Shah Rukh Khanముంబై: బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాడు. ట్విట్టర్లో షారుక్ ఫాలోయర్ల సంఖ్య మంగళవారం నాటికి 80 లక్షలు దాటింది.

బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్కు ట్విట్టర్లో 90 లక్షల మందికిపైగా ఫోలోయర్లుండగా, ఆ తర్వాతి స్థానంలో షారుక్ నిలిచాడు. వీరి తర్వాతి స్థానాల్లో బాలీవుడ్ హీరోలు సల్మాన్ ఖాన్ (7.18 లక్షలు), అమీర్ ఖాన్ (7.17 లక్షలు) ఉన్నారు. 2010లో ట్విట్టర్ ఖాతా తెరిచిన షారుక్ ఎప్పటికప్పుడు అభిమానులకు విశేషాలు తెలియజేస్తుంటాడు. వ్యక్తిగత జీవితం నుంచి సినిమాలు, క్రికెట్ ఇలా ఎన్నో విషయాలు పంచుకుంటాడు.

Leave a Comment