తానా రైతు కోసం రక్షణ కిట్స్…

రైతు కోసం…తానా

Posted by Chinthana on Sunday, December 23, 2018ఉత్తర అమెరికా తెలుగు సంఘం రెండేళ్లకు ఒకసారి జన్మభూమిలో డిసెంబర్ 23 నుంచి జనవరి 12 వ తేదీ వరకూ నిర్వహించే “చైతన్య స్రవంతి” కార్యక్రమాల్లో, ఈ సారి రైతు రక్షణ అంశానికి ప్రాధాన్యం ఇస్తున్నట్లు “తానా” అధ్యక్షులు సతీశ్ వేమన తెలిపారు. “రసాయనాలు, పురుగుమందులను రైతులు కనీస జాగ్రత్తలు తీసుకోకుండా ఉపయోగించే సమయంలో అనారోగ్యానికి గురవ్వటంతో పాటు కొన్నిసార్లు మందుల తీవ్రత కారణంగా పొలంలోనే మృతి చెందటం జరుగుతోంది! ఈ మధ్య కాలంలో మహారాష్ట్రలో జరిగిన ఈ తరహా రైతు మరణాలు సంభవించాయి. అందులోనూ, రసాయన ఎరువులు, క్రిమి సంహారకాల వాడకంలో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే అగ్రస్థానంలో ఉండటం వంటి పరిణామాలు ప్రవాసాంధ్రులను ఆలోచింపచేస్తున్న నేపధ్యంలో తానా “రైతు కోసం” కమిటీ అధ్యక్షులు కోట జానయ్య పర్యవేక్షణలో ఈ “రక్షణ కిట్” రూపొందించటం జరిగింద. పంటలలో హానికారక పదార్దాల వాడకం అంశంలో రైతులను చైతన్య పరచటం కోసం “రైతు రధం” వాహనాన్ని రాష్ట్రంలోని అన్ని జిల్లాలలో పర్యటనకి ఏర్పాటు చెయ్యబడింది” అని సతీశ్ వేమన తెలిపారు…

రసాయన రక్షక కళ్ళజోడు,
చేతి తొడుగుల జత,
ముఖాన్ని నోటిని కప్పి ఉంచే శ్వాస వడపోత తొడుగు,
మెడ నుండి మోకాళ్ళ వరకూ కప్పి ఉంచే ప్రత్యేక దుస్తుల జత
టార్ఛ్ లైట్,
ఒక గొడుగు
ఈ రక్షణ కిట్ లో రైతులకు ఉచితంగా అందచేయనున్నారు.

కాగా, రాష్ట్ర అభివృద్ధి, తెలుగు భాష అభివృద్ధి, తెలుగు సాహిత్య, సాంస్కృతిక వారసత్వం మరియు జానపద కళల పునరుత్తేజం ధ్యేయంగా సాగే రాష్ట్రవ్యాప్త తానా “చైతన్య స్రవంతి” కార్యక్రమాలకు ప్రజలందరూ హాజరయ్యి విజయవంతం చేయాలని తానా ప్రతినిధులు కోరారు.
“తానా చైతన్య స్రవంతి” కార్యక్రమాలు
డిసెంబర్:
23 గురజాల, 23 విజయవాడ, 24 తాడేపల్లిగూడెం, మద్దూరు, తణుకు, 26 భీమిలి, మాడుగుల, కర్నూలు, 28 కొత్తగూడెం, 29 ఖమ్మం, 30 హైదరాబాద్,
జనవరి:
3 మాచెర్ల, సత్తెనపల్లి, 4 పుల్లడిగుంట, ఒంగోలు, 5 రాజంపేట, తాళ్ళపాక, 6 తిరుపతి, 7 అవనిగడ్డ, పెనుగంచిప్రోలు, 8 విజయవాడ, వీరవల్లి, 12 కర్నూలు, పశ్చిమ గోదావరి- చిన్నయ్యగూడెం

Leave a Comment