తెరమీదకు మళ్ళీ సబ్బం హరి

గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్న సబ్బం హరి అనంతరం కోతకాలం పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కొనసాగారు.. ఆ తరువాత.. తమ్మినేని సీతారం జగన్ పార్టీలోకి ఎంట్రి ఇవ్వడంతో.. సబ్బం హరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చేశారు. అనంతరం.. ఆయన సమైక్యాంద్రాకు మద్దతుగా కిరణ్ కుమార్ రెడ్డి స్థాపించిన సమైక్యాంద్రా పార్టీలో చేరి, విశాఖ తరుపున పోటీకి దిగిన విషయం తెలిసిందే.. అయితే, చివరి నిమిషంలో, ఆయన పోటీనుంచి తప్పుకొని.. బీజేపీకి మద్దతు పలికారు. అప్పటినుంచి ఆయన.. రాజకీయాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. కాని, సబ్బం హరి బీజేపి నేతలతో సన్నిహితంగా ఉంటున్నట్టు సమాచారం. అంతేకాకుండా, రాబోయే ఫిబ్రవరిలో కార్పోరేషన్ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికలు బీజేపీకి కీలకం కానున్నాయి. దీంతో, విశాఖలో పట్టు ఉన్న సబ్బం హరి చూపులు బీజేపి వైపు ఉన్నట్టు తెలుస్తున్నది. సబ్బం హరి బీజేపిలో చేరితే..ఆ పార్టీ విశాఖలో మంచి పట్టుసాదిస్తుందని బీజేపి నేతలు అభిప్రాయ పడుతున్నట్టు తెలుస్తున్నది. అంతేకాకుండా, బీజేపి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బలోపేతం కావడానికి ఉన్న అన్ని వనరులను ఉపయోగించుకోవాలని చూస్తున్నది. ఇదే నిజమైతే.. తెలుగుదేశం పార్టీని విమర్శిస్తూ వచ్చిన సబ్బంహరి ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి మిత్రుడుగా మారవలసి వస్తుంది. శతృవులు మిత్రులుగా మారడం, మిత్రులు శతృవులుగా మారడం రాజకీయాలో షరా మామూలే.. కాని, రాష్ట్రవిభజన అనంతరం.. ఈ మిత్రత్వం.. శతృత్వంలో అనేక మార్పులు సంభవించాయి. బహుశా ఇటువంటి పరిణామం ఎవరూ ఊహించిఉండక పోవచ్చు.

Leave a Comment