బ్యాంకాక్: థాయ్‌లాండ్‌లో సైనిక పాలన ప్రారంభమైంది. దేశంలో సుస్థిరతను స్థాపించడానికి ప్రభుత్వాన్ని సైన్యం ఆధీనంలోకి తీసుకున్నట్లు థాయ్ సైన్యాధిపతి జనరల్ ప్రయూత్ చౌన్ ఓచా ప్రకటించారు. దాదాపు ఏడేళ్లుగా రాజకీయ అస్థిరతతో, సంక్షోభాలతో థాయ్‌లాండ్ కొట్టుమిట్టాడుతోంది. ప్రధాని షినవాత్రా దిగిపోవాలని థాయ్‌లాండ్‌లో గత నవంబర్ నుంచి ఆందోళనలు సాగుతున్నాయి. రాజకీయ పార్టీలతో రెండు రోజులుగా సైన్యాధికారులు జరిపిన చర్చలు ఫలించలేదు. ఈ నేపథ్యంలో సైన్యం అధికారాన్ని చేజిక్కించుకుంది.
థాయ్‌లాండ్ సాయుధ బలగాలు సైన్యం, రాయల్ ఎయిర్ ఫోర్స్, పోలీసులు మే 22వ తేదీ సాయంత్రం నాలుగున్నర గంటలకు అధికారాన్ని చేతిలోకి తీసుకున్నట్లు చాన్ ఓ చా ప్రకటించారు. తమది కుట్ర కాదని, దేశంలో సుస్థిరతను స్థాపించడానికి తాము అధికారాన్ని చేతుల్లోకి తీసుకున్నామని సైన్యాధిపతి ప్రకటించారు.
Recent Comments