‘నగ్న’ వివాదంలో సన్నీలియోన్‌

sunny leoneపోర్న్‌ సినిమా రంగం నుంచి బాలీవుడ్‌లోకి వచ్చిన సన్నీలియోన్‌, ‘నగ్న వివాదం’ ఎదుర్కొంటోంది. ఆమె ఓ ఫంక్షన్‌లో అర్థనగ్నంగా డాన్సులేసిందంటూ కొన్ని ఫొటోలు ఇంటర్నెట్‌లో హల్‌చల్‌ చేస్తున్నాయి. ఈ ఫొటోలు ఆమె నటించిన పోర్న్‌ సినిమాలకన్నా ఎక్కువగా సర్క్యులేట్‌ అవుతున్నాయి. మరోపక్క, దిగ్విజయ్‌సింగ్‌ పెళ్ళిలో సన్నీలియోన్‌ నగ్నంగా డాన్సులేస్తే తాను కోటి రూపాయలిస్తానంటూ కమల్‌ ఆర్‌ ఖాన్‌ ట్వీట్‌ చేయడం పెద్ద వివాదంగా మారింది. తనను అప్రతిష్టపాల్జేసేందుకు ప్రయత్నిస్తున్నాడంటూ కమల్‌ ఆర్‌ ఖాన్‌పై పోలీసులను ఆశ్రయించింది సన్నీలియోన్‌. కమల్‌ ఆర్‌ ఖాన్‌కీ సన్నీలియోన్‌కీ గత కొన్నాళ్ళుగా వివాదం నడుస్తోంది. అతనెందుకు ఆమెనే టార్గెట్‌గా చేసుకున్నాడోగానీ, పరోక్షంగా సన్నీలియోన్‌కి కమల్‌ ఆర్‌ ఖాన్‌ కారణంగా బోల్డంత పబ్లిసిటీ వచ్చిపడ్తోంది. పోర్న్‌ రంగాన్ని మర్చిపోయి, బాలీవుడ్‌ సినిమాలు చేసుకోవాలనుకుంటోన్న సన్నీలియోన్‌కి మళ్ళీ గతం గుర్తుచేస్తున్నాడు కమల్‌ ఆర్‌ ఖాన్‌. ఇద్దరి మధ్యా వివాదం ఎప్పుడు సద్దుమణుగుతుందోగానీ, సన్నీలియోన్‌ ఫిర్యాదుపై పోలీసులు కాస్తంత సీరియస్‌గానే రియాక్ట్‌ అవుతున్నారట కమాల్‌ ఆర్‌ ఖాన్‌ విషయంలో.

Leave a Comment