నేడు తగ్గనున్న కరెంట్ కోతలు….

దీపావళి పర్వదినం సందర్భంగా రాష్ట్రంలో నేడు విద్యుత్ కోతల సమయాన్ని తగ్గించనున్నారు. హైదరాబాద్ తో పాటు జిల్లా, మండల కేంద్రాల్లో విద్యుత్ ను రోజంతా సరఫరా చేయనున్నారు. ప్రస్తుతం విధిస్తున్న విద్యుత్ కోతను పూర్తిగా తగ్గించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తుంది. ఇందు కోసం 2 వేల మెగావాట్ల థర్మల్ విద్యుత్ ను కోనుగోలు చేయనున్నారు.

Leave a Comment