ప్రభుత్వం అన్నిరకాలుగా విఫలమైంది

టీఆర్ఎస్ పాలనలో రైతులు, విద్యార్థులు, సామాన్య ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని తెలంగాణ టీడీపీ నాయకుడు ఎర్రబెల్లి దయాకరరావు విమర్శించారు. ప్రజలంతా కష్టాలు పడుతుంటే సీఎం విహారయాత్రలు చేస్తున్నారని దుయ్యబట్టారు.  విద్యుత్ విషయంలో టీఆర్ఎస్ ప్రభుత్వం అన్నిరకాలుగా విఫలమైందన్నారు. వెంటనే అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. అసెంబ్లీ సమావేశాలు మరోసారి వాయిదా వేయకుండా గడువు ప్రకారం నిర్వహించాలని ఎర్రబెల్లి సూచించారు.

Leave a Comment