ప్రభుత్వం దూర దృష్టితో ఆలోచించలేదు

శ్రీశైలంలో విద్యుదుత్పత్తి ఆపే అంశంపై టీఆర్ఎస్ ప్రభుత్వం రాద్ధాంతం చేస్తుందని   ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు.ఈ మేరకు హైదరాబాదులోని ఏపీ సచివాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ….విద్యుత్ విషయంలో తెలంగాణ ప్రభుత్వం దూర దృష్టితో ఆలోచించలేదన్నారు. కానీ,ఆంధ్రప్రదేశ్  ప్రభుత్వం ముందు చూపుతో విద్యుత్ ను యూనిట్ కు రూ.6 పెట్టి కొనుగోలు చేశామని చెప్పారు. అయినా, తెలంగాణ ప్రజల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని తాము 300 మెగావాట్లు ఇచ్చేందుకు సిద్ధమయ్యామని బాబు వివరించారు.జులైలో  కృష్ణా బోర్డు వద్దకు రెండు రాష్ట్రాలూ వెళ్లాయని… 69, 107 జీవోల అమలుకు రెండు ప్రభుత్వాలు ఒప్పుకున్నాయని, అప్పుడు బోర్డు ముందు ఒప్పుకుని ఇప్పుడెందుకు తెలంగాణ ప్రభుత్వం గొడవ చేస్తోందోనని ప్రశ్నించారు

Leave a Comment