ప్రముఖ నిర్మాత రామానాయుడు కన్నుమూత

D Ramanaidu(1)

భారత దేశం గర్వించతగ్గ స్టార్ ప్రొడ్యూసర్ దగ్గుభాటి రామానాయుడు (79) ఈరోజు మద్యాహ్నం హైదరాబాద్ లో కన్నుమూసారు. గతకొంత కాలంగా క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న రామానాయుడు క్యాన్సర్ ట్రీట్ మెంట్ తీసుకుంటున్నారు. కానీ ఈరోజు పరిస్థితి మరీ విషమించడంతో తిరిగి రాని లోకాలకు వెళ్లారు. రామానాయుడు అకాల మృతి వార్త దావానలం లా వ్యాపించడంతో ఒక్కసారిగా చిత్ర పరిశ్రమ షాక్ కి గురయ్యారు. దేశంలోని 15భాషలలో దాదాపు 155చిత్రాలను నిర్మించిన మహనీయుడు రామానాయుడు. రాముడు -భీముడు చిత్రంతో సూపర్ హిట్ అందుకున్న రామానాయుడు సినీ రంగంలోనే కాకుండా రాజకీయ రంగంలో అడుగుపెట్టి లోక్ సభ కు ఎన్నికై తన జిల్లా ప్రజలకు విశిష్ట సేవలందించారు.

Leave a Comment