ప్రవాస తెలంగాణేయులకు శుభవార్త….

ప్రవాసీయుల పై ప్రత్యేక దృష్టి సారించింది తెలంగాణ సర్కార్. ఎన్ఆర్టీల సమస్యలను తీర్చేందుకు కొద్ది రోజులుగా కసరత్తు చేస్తోంది. ఎన్నికల ప్రణాళికలో పేర్కొన్నట్లు ప్రవాస తెలంగాణేయుల కోసం ఓ ప్రత్యేకశాఖ ఏర్పాటుకు సన్నాహాలు జరుగుతున్నాయి.

ఎన్నికల ప్రణాళికలను వరుసపెట్టి అమలు చేసుకుంటూ వెళ్తున్న టీఆర్ఎస్ ప్రభుత్వం…ఇప్పుడు ప్రవాస తెలంగాణేయులపై దృష్టి సారించింది. ఎన్ఆర్టీలు విదేశాల్లో అష్టకష్టాలు పడుతున్నారని గుర్తించి…..వారిని ఆదుకునేందుకు కసరత్తు ప్రారంభించింది. కేరళ, పంజాబ్ తరహా విధానాల వలె ఓ కొత్త తరహా విధానాన్ని అమలు చేసేందుకు ప్లాన్ చేస్తోంది. దీనికోసం వీలైనంత త్వరగా ఓ ప్రత్యేక శాఖను, సహాయకేంద్రాన్ని ఏర్పాటు చేసి….కొద్దిరోజుల్లో జరగబోయే శాసనసభ సమావేశాల్లో బిల్లును  ప్రవేశపెట్టాలని ప్రభుత్వం భావిస్తోంది.

తెలంగాణకు సంబంధించి సుమారు 8లక్షల మంది వివిధ పనులకోసం విదేశాలకు వెళ్లి అక్కడే స్థిరపడ్డారు. అయితే అక్కడ వారు పడుతున్న కష్టాలు అన్నీ ఇన్నీ కాదు. కొందరు బ్రోకర్ల చేతిలో మోసపోగా….మరికొందరు ఆ దేశాల్లో జరిగుతన్న దాడుల్లో గాయపడుతున్నారు. అయినా వాళ్లను పట్టించుకున్నవారు లేరు. దీంతో కేసీఆర్ ప్రభుత్వం ఎన్ఆర్టీల సమస్యలను తీర్చాలని నిర్ణయించింది. ఎవరు మోసపోయినా ఆదుకునేందుకు చర్యలు ప్రారంభిస్తోంది. ఇప్పటికే దీనిపై కేబినెట్ లో చర్చించి తీర్మానించిన కేసీఆర్ ప్రభుత్వం…అమలుకోసం ప్రత్యేక కార్యాచరణ చేపట్టింది. అయితే ఎన్ఆర్టీల కోసం ప్రభుత్వం ఏర్పాటు చేయబోయే ప్రత్యేకశాఖ విషయంలో ప్రభుత్వం ఆచితూచి వ్యవహరిస్తోంది. లోపాలు లేకుండా పకడ్బందీగా అమలు చేయాలని సీఎం కేసీఆర్ భావిస్తున్నారు. దీనికోసం ఇప్పటికే కేరళ, పంజాబ్ ప్రభుత్వాలతో చర్చలు జరిపి, తర్వాత ఎన్ఆర్టీల అభిప్రాయాల సేకరించింది. వీటిన్నింటిని దృష్టిలో పెట్టుకొని ఒక మంచి వ్యవస్థను రూపోందించాలని టీఆర్ఎస్ ప్రభుత్వం భావిస్తోంది. ఇది ఆచరణలోకి వస్తే విదేశాల్లో బాధపడుతున్న ఎన్ఆర్టీల సమస్యలకు పరిష్కారం లభించనుంది. అంతేకాదు మరీ వారు ఇక్కడికి రాగానే జీవనోపాధి కూడా దొరకనుంది.

Leave a Comment