ప్రసారం చేస్తే తప్పేంటీ

ఆర్‌ఎస్‌ఎస్ అధినేత మోహన్ భగవత్ ప్రసంగాన్ని దూరదర్శన్ లో ప్రత్యక్ష ప్రసారం చేయడాన్ని కేంద్ర ప్రభుత్వం సమర్థించుకుంది. దూరదర్శన్ చేసిన దాంట్లో తప్పేంలేదని కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్ అన్నారు. దూరదర్శన్ కార్యకలాపాల్లో తాము జోక్యం చేసుకోబోమని స్పష్టం చేశారు. భగవత్ ప్రసంగాన్ని ప్రత్యక్ష ప్రసారం చేస్తే తప్పేంటని ప్రశ్నించారు.
ఆర్‌ఎస్‌ఎస్ 89వ వ్యవస్థాపక దినోత్సవంతో పాటు దసరా సందర్భంగా అక్టోబర్ 3న భాగవత్ చేసిన ప్రసంగాన్ని దూరదర్శన్‌లో గంట పాటు ప్రత్యక్ష ప్రసారం చేశారు. ఆర్‌ఎస్‌ఎస్ నిర్వహించిన ఒక కార్యక్రమాన్ని దూరదర్శన్‌లో ప్రత్యక్ష ప్రసారం చేయడం ఇదే తొలిసారి. భగవత్ ప్రసంగాన్ని ప్రత్యక్ష ప్రసారం చేయడాన్ని కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీలు తీవ్రంగా తప్పుబట్టాయి.

Leave a Comment