బెంగళూరు: ఐపిఎల్ 7ల ఛాంపియన్ ట్రోఫీని బాలీవుడ్ నటుడు షారూక్ ఖాన్‌కు చెందిన కోల్‌కతా నైట్ రైడర్స్ ఎగురేసుకుపోయింది. తొలి నుండి దూకుడుగా ఆడి, తొలిసారి ఫైనల్‌కు వచ్చిన.. బాలీవుడ్ నటి ప్రీతిజింటాకు చెందిన కింగ్స్ ఎలెవన్ పంజాబ్ రన్నరప్‌గా నిలిచింది. తొలిసారి టైటిల్ అందుకోవాలని ఉవ్విళ్లూరిన పంజాబ్‌ను ఓడించిన కోల్‌కతా టైటిల్ సాధించింది. తొలుత బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్ 20 ఓవర్లలో నాలుగు వికెట్లకు 199 పరుగులు సాధించింది. రెండు వందల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన కోల్‌కతా 19.3 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి విజయభేరి మోగించింది. పంజాబ్ బ్యాట్స్‌మన్ వృద్ధిమాన్ సాహా వీరోచిత సెంచరీ వృథా అయింది. కోల్‌కతా హీరో మనీష్ పాండే ఆరు పరుగుల తేడాతో సెంచరీని చేజార్చుకున్నప్పటికీ తన జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. టాస్ గెలిచిన కోల్‌కతా కెప్టెన్ గౌతం గంభీర్ ఫీల్డింగ్‌ను ఎంచుకున్నాడు. చిన్నస్వామి స్టేడియంలో టాస్ గెలిచి ఫీల్డింగ్ తీసుకున్న సందర్భాలు 35 కాగా, లక్షాన్ని ఛేదించిన సందర్భాలు 15 మాత్రమే. ఈ గణాంకా
లను పట్టించుకోని గంభీర్ తన జట్టు బ్యాటింగ్ బలంపై కొండంత నమ్మకంతో ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. ప్రత్యర్థి ఆహ్వానం మేరకు మొదట బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్ 23 పరుగుల వద్ద ఓపెనర్ వీరేందర్ సెహ్వాగ్ వికెట్‌ను కోల్పోయింది. చెన్నైతో జరిగిన మ్యాచ్‌లో సెంచరీతో విరుచుకుపడిన సెహ్వాగ్ 10 బంతుల్లో ఏడు పరుగులు చేసి ఉమేష్ యాదవ్ బౌలింగ్‌లో గౌతం గంభీర్ క్యాచ్ అందుకోగా వెనుదిరగడంతో కోల్‌కతా ఊపిరి పీల్చుకుంది. కెప్టెన్ జార్జి బెయిలీ ఒక పరుగుకే సునీల్ నారైన్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. 30 పరుగులకు రెండు వికెట్లు కోల్పోయిన పంజాబ్‌ను ఓపెనర్ మానన్ వోహ్రా, సెకండ్ డౌన్ బ్యాట్స్‌మన్, వికెట్‌కీపర్ వృద్ధిమాన్ సాహా ఆదుకున్నారు. సునీల్ నారైన్ సహా కోల్‌కతా బౌలర్లను ఏమాత్రం లక్ష్య పెట్టకుండా ఇద్దరూ పరుగులు రాబట్టడంలో నిమగ్నమయ్యారు. వోహ్రా చక్కటి సహకారాన్ని అందించగా, గతంలో ఎన్నడూ లేని విధంగా రెచ్చిపోయిన సాహా పరుగుల వరద పారించాడు. ఈ ఐపిఎల్‌లో మూడో అర్ధ సెంచరీ పూర్తి చేశాడు. 52 బంతులు ఎదుర్కొని, ఆరు ఫోర్లు, రెండు సిక్సర్లతో 67 పరుగులు సాధించిన వోహ్రాను పీయూష్ చావ్లా రిటర్న్ క్యాచ్ అందుకొని అవుట్ చేయడంతో వీరి భాగస్వామ్యానికి తెరపడింది. మూడో వికెట్‌కు 159 పరుగులు జత చేసిన తర్వాత సాహా
అదే దూకుడును కొనసాగించాడు. కోల్‌కతాను ఇబ్బంది పెడతాడనుకున్న గ్లేన్ మాక్స్వెల్ మొదటి బంతినే రివర్వ్ స్వీప్ సాయంతో థర్డ్‌మన్ స్థానానికి కొట్టి పరుగులు రాబట్టే ప్రయత్నంలో మోర్న్ మోర్కెల్‌కు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. చావ్లా వేసిన ఆ ఓవర్లో మొదటి బంతికి వోహ్రా, చివరి బంతికి మాక్స్వెల్ అవుట్ అయ్యారు. మిగతా రెండు ఓవర్లలో డేవిడ్ మిల్లర్ (నాటౌట్ 1)కు ఒకే బంతిని ఎదుర్కొనే అవ
కాశం లభించింది. మిగతా బంతులను ఆడిన సాహా మొత్తం 55 బంతుల్లో పది ఫోర్లు, ఎనిమిది భారీ సిక్సర్లతో అజేయంగా 115 పరుగులు సాధించాడు. ఐపిఎల్‌లో ఇదే అతనికి తొలి సెంచరీ. గత సీజన్లు మొత్తంలో
ఒకే ఒక అర్ధ సెంచరీ మాత్రమే సాధించిన అతను ఈసారి అసాధారణ ప్రతిభ కనబరచడం గమనార్హం. కోల్‌కతా బౌలర్లలో పీయూష్ చావ్లాకు రెండు వికెట్లు లభించాయి.
ఈ సీజన్లో మొదటి నుండి నిలకడగా ఆడుతూ కోల్‌కతా విజయాల్లో కీలక పాత్ర పోషించిన రాబిన్ ఉతప్ప కేవలం ఐదు పరుగులు చేసి మిచెల్ జాన్సన్ బౌలింగ్‌లో అక్షర్ పటేల్‌కు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. ఉతప్ప ఏడో ఐపిఎల్‌లో అందరికంటే ఎక్కువగా 660 పరుగులు సాధించాడు. రెండో వికెట్‌కు మనీష్ పాండేతో కలిసి 5.3 ఓవర్లలో 53 పరుగులు జోడించిన కెప్టెన్ గంభీర్ 23 పరుగుల వ్యక్తిగత స్కోరువద్ద కరన్వీర్ సింగ్ బౌలింగ్‌లో డేవిడ్ మిల్లర్ బౌండరీ లైన్ వద్ద క్యాచ్ అందుకున్నాడు. ఈ దశలో మనీష్ పాండే, యూసుఫ్ పఠాన్ వ్యూహాత్మకంగా ఆడుతూ ఆదుకున్నారు. అయితే, 36 పరుగులు
చేసిన యూసుఫ్ పఠాన్‌ను మాక్స్వెల్ క్యాచ్ అందుకోగా కరన్వీర్ సింగ్ అవుట్ చేయడంతో, 7.2 ఓవర్లలో 71 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. పాండే నిలకడగా ఆటను కొనసాగిస్తే, షకీబ్ అల్ హసన్ 12 పరుగులు చేసి రనౌటయ్యాడు. డొస్చెట్ (4)ను మిల్లర్ క్యాచ్ పట్టగా కరన్వీర్ సింగ్ పెవిలియన్‌కు పంపాడు. మనీష్ పాండే అదే ఓవర్లో బెయిలీకి చిక్కాడు. అతను 50 బంతులు ఎదుర్కొని 94 పరుగులు సాధించాడు. చివరి రెండు ఓవర్లలో కోల్‌కతా 15 పరుగులు చేయాల్సి ఉండగా.. మిచెల్ జాన్సన్ 19వ ఓవర్లో సూర్యకుమార్ యాదవ్ (5)ను వోహ్రా క్యాచ్ పట్టగా అవుట్ చేశాడు. చావ్లా భారీ సిక్స్ కొట్టడంతో ఆ ఓవర్లో కోల్‌కతాకు 10 పరుగులు లభించాయి. ఆవానా వేసిన చివరి ఓవర్ మూడో బంతిని ఫోర్ కొట్టిన చావ్లా జట్టును గెలిపించాడు.
Recent Comments