హైదరాబాద్: జనసేన పార్టీని ఆరు నెలల్లో పూర్తిస్థాయి రాజకీయ పార్టీ రూపొందిస్తామని పవన్ కళ్యాణ్ తెలిపారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పోటీ చేస్తే సీట్లు రావనే భయం తమకులేదన్నారు. ఓటమిని కూడా స్వాగతిస్తామని చెప్పారు. పూర్తిస్థాయి రాజకీయ నాయకుడిగా ఎదగాలంటే దానికి అనుభవం కావాలన్నారు. రాజకీయ అనుభవం కోసం రెండు మూడుసార్లు ఫెయిల్ కావడానికి కూడా సిద్దమన్నారు.
తెలంగాణ వచ్చాక కూడా కేసీఆర్ విద్వేషాలు రెచ్చగొట్టేలా మాట్లాడడం దేశసమగ్రతకు మంచిదికాదన్నారు. తన దగ్గర ఏమైనా నిర్మాణాత్మక సూచనలుంటే ఎన్డీఏ ప్రభుత్వానికి చెబుతానన్నారు. పార్లమెంట్ సెంట్రల్ హాల్ లో ఎన్డీఏ సభ్యుడిగా తనను కూర్చోబెట్టారంటే అది నరేంద్ర మోడీ ఘనత అని పవన్ కళ్యాణ్ అన్నారు.
Recent Comments