ఫేస్‌బుక్‌ ద్వారా నగదు బదిలీ

మీ జేబులో స్మార్ట్ ఫోన్ వుందా..? అందులో ఫేస్ బుక్ అప్లికేషన్ వుందా..? అయితే మీరు ఎప్పుకైనా, ఎక్కడైనా ఆర్థిక లావాదేవీలు జరుపుకునే వీలుంది. సోషల్‌ నెట్‌వర్కింగ్‌ సైట్‌ ఫేస్‌బుక్‌ ద్వారా ఆర్థిక లావాదేవీలు జరిపేందుకు వీలుగా 09-10-20141412849869facebookహైదరాబాద్‌ సంస్థ డిజిట్‌ సెక్యూర్‌ ‘హాట్‌రెమిట్‌’ పేరుతో ఇ-వాలెట్‌ను ప్రవేశపెట్టింది.

ఫేస్‌బుక్‌ వినియోగదారులతోపాటు బ్లాక్‌బెర్రీ వినియోగదారులు కూడా హాట్‌రెమిట్‌ ద్వారా నగదు బదిలీ, బిల్లుల చెల్లింపులు చేసుకునే వెసులుబాటు ఉంటుంది. మరో నెలరోజుల్లో అన్నిరకాల ఆండ్రాయిడ్‌ స్మార్ట్‌ ఫోన్ల నుంచి కూడా హాట్‌రెమిట్‌ ద్వారా లావాదేవీలు జరిపేందుకు వీలుగా అప్లికేషన్స్‌ను ఆవిష్కరించనున్నట్టుగా సంస్థ చైర్మన్‌ కృష్ణప్రసాద్‌ చెప్పారు.

హాట్‌రెమిట్‌ సర్వీసును ప్రముఖ నటి శ్రీదేవి కపూర్‌ లాంఛనంగా ఆవిష్కరించారు. సమావేశంలో తెలంగాణ ఐటి మంత్రి కె తారకరామారావు పాల్గొన్నారు. నగదు బదిలీ, బిల్లుల చెల్లింపులకు ఫేస్‌బుక్‌ అప్లికేషన్‌ను డెవలప్‌ చేసిన తొలి కంపెనీ తమదేనని కృష్ణప్రసాద్‌ చెప్పా రు. భారీ మొత్తాలు కాకుండా చిన్న, చిన్న మొత్తాలను బదిలీ చేసుకునేందుకు, బిల్లులు చెల్లించేందుకు తమ హాట్‌రెమిట్‌ ఉపయోగపడుతుందని ఆయన తెలిపారు. హాట్‌రెమిట్‌ ద్వారా చెల్లింపుల కోసం క్రెడిట్‌, డెబిట్‌ కార్డులను ఉప యోగించవచ్చనీ ఈ విషయంలో తమకు ఆర్‌బిఐ లైసెన్స్‌ కూడా ఉందని చెప్పారు. లావాదేవీల భద్రతకు సంబంధించి అత్యున్నతమైన పిసిఐ-డిఎస్‌ఎస్‌ సర్టిఫికేషన్‌ కూడా డిజిట్‌ సెక్యూర్‌కు ఉన్నట్టు ఆయన వివరించారు. సంప్రదాయ మనీ ట్రాన్స్‌ఫర్‌ వ్యవహారాల్లో ఉండే చికాకులు లేకుండా రియల్‌ టైమ్‌లో హాట్‌రెమిట్‌ ద్వారా డబ్బులు బదిలీ చేయవచ్చని ఆయన వివరించారు. సాధారణంగా ఒక వినియోగదారుడు బదిలీ చేసిన నగదు ముందుగా హాట్‌రెమిట్‌ ఇ వాలెట్‌కు వెళుతుంది. లబ్దిదారులు దానిని నేరుగా తమ బ్యాంకు ఖాతాలోకి మళ్లించుకోవచ్చు లేదా ఇ వాలెట్‌లోనే ఉంచి అవసరాలను బట్టి బిల్లుల చెల్లింపులు చేసుకోవచ్చని కృష్ణప్రసాద్‌ చెప్పారు.

Leave a Comment