ఫేస్ బుక్ తో గూగుల్ పోటి!

ఫేస్‌బుక్‌కు నేరుగా పోటీగా వస్తామంటోంది గూగుల్‌. వాట్సాప్‌ తరహాలోనే సరికొత్త మెసేజింగ్‌ యాప్‌ను తీసుకొస్తోంది గూగుల్‌. 2015 తర్వాత అందుబాటులోకి వచ్చే ఈ యాప్‌ అత్యాధునిక హంగులతో ఆకట్టుకుంటుంటుందని కంపెనీ 06-10-20141412578465google-facebookవర్గాలంటున్నాయి. ఫేస్‌బుక్‌ సంస్థ వాట్సాప్‌ను సొంతం చేసుకునేందుకు అడ్డంకులు తొలిగాయి. దాదాపు అది కంపెనీ సొంతమైంది. మేసేజింగ్‌ విభాగంలో తిరుగులేని వాట్సాప్‌ చేరికతో ఫేస్‌బుక్‌ తలరాత మారనుందని మార్కెట్‌ వర్గాలంటున్నాయి. అదే సమయంలో స్నాప్‌చాట్‌ అనే మరో యాప్‌ను సొంతం చేసుకోవడానికి యాహూ సంస్థ ఉవ్విళ్లూరుతోంది. భారీ పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమవుతోంది. అయితే వీటికి భిన్నంగా గూగుల్‌.. సొంతంగా ఈ విభాగంలో అడుగుపెట్టడానికి ఏర్పాట్లు చేసుకుంటోంది. ఇంకా పేరుపెట్టని ఈ అప్లికేషన్‌ను 2015 నాటికి మార్కెట్‌లో విడుదల చేయాలని చూస్తోంది. వాట్సాప్‌, స్నాప్‌ఛాట్‌, ట్విట్టర్‌ కంటే ఆధునిక సదుపాయాలు ఇందులో ఉంటాయట. వాట్సాప్‌ మార్కెట్‌ను కొల్లగొట్టడమే దీని లక్ష్యమని తెలుస్తోంది. వాయిస్‌ టూ టెక్స్ట్‌ మేసేజింగ్‌ సదుపాయం కూడా ఇందులో ఉంటుందట. ఇంగ్లీష్‌తో పాటు.. దేశీయ భాషల్లో కూడా సర్వీసులు అందించడానికి అనుగుణంగా సాఫ్ట్‌వేర్‌ అభివృద్ధి చేస్తున్నారు.

భారత్, బ్రెజిల్‌, ఇండినేషియా దేశాల మార్కెట్‌పై ప్రధానంగా గూగుల్‌ కన్నేసినట్టు తెలుస్తోంది. వాట్సాప్‌పై కన్నేసిన గూగుల్‌ దానిని సొంతం చేసుకునేందుకు ఫేస్‌బుక్‌తో పోటీపడ్డా చివరకు దక్కించుకోలేకపోయింది. సొంతంగా డెవలప్‌ చేయాలని నిర్ణయించింది. ప్రపంచవ్యాప్తంగా కోట్ల సంఖ్యలో ఉన్న గూగుల్ ప్లస్‌ వినియోగదారులను అనుకూలంగా మలుచుకుని సోషల్‌ మార్కెట్‌లోని ఈవిబాగంలో సత్తా చాటాలనుకుంటోంది. అందుకే 2015 నాటికి మార్కెట్‌లో కొత్త పేరుతో అడుగుపెడుతోంది. వాట్సాప్‌ తరహాలో ఏడాది తర్వాత కనీస ఛార్జీలు కూడా గూగుల్‌ వసూలు చేయనంటోంది.. యాప్‌ను ఉచితంగా డౌన్‌లోడ్‌ చేసుకుని.. వాడుకొచ్చని చెబుతోంది. దీంతో వాట్సాప్‌కు త్వరలోనే గట్టి పోటీ రానుంది.

Leave a Comment