బలహీన పడుతున్న తుపాన్

హుదూద్ పెనుతుపాన్ వేగంగా బలహీన పడుతోందని వాతావరణ శాఖ తెలిపింది . కొన్నిగంటల్లో  తుపాన్ అల్పపీడనంగా మారే అవకాశముందని వాతావరణ శాఖ వెల్లడించింది . గాలులతీవ్రత కొన్నిగంటల్లో గణనీయంగా తగ్గుతుందని అధికారులు తెలిపారు.
తుపాన్ ప్రభావం విశాఖపట్నంపై తీవ్రంగా ఉంది. భారీ వర్షాలు, బలమైన ఈదురు గాలులతో విశాఖ నగరం చిగురుటాకులా ఒణికిపోతోంది.  విశాఖలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. సెల్ ఫోన్ సిగ్నల్స్ పనిచేయడం లేదు. సముద్రం అల్లకల్లోలంగా ఉంది. బలమైన ఈదురు గాలులు వీస్తున్నాయి. దీంతో విశాఖ వాసులు ఆందోళన చెందుతున్నారు.

Leave a Comment