బసవతారకం కాన్సర్ హాస్పిటల్ అమరావతి

 


బసవతారకం క్యాన్సర్‌ ఆస్పత్రికి భూమిపూజ
రాజధాని ప్రాంతం తుళ్లూరు గ్రామంలో బసవతారకం ఇండో-అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్, రీసెర్చ్  ఇనిస్టిట్యూట్ నిర్మాణానికి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు శంకుస్థాపన చేశారు.

ఈ ప్రతిష్టాత్మక వైద్య సంస్థ స్థాపన కార్యక్రమంలో బాలకృష్ణ దంపతులు పాల్గొని శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారు.

కార్యక్రమంలో సభాపతి కోడెల శివప్రసాదరావు, ప్రముఖ వైద్యులు దత్తాత్రేయుడు నోరి తదితరులు పాల్గొన్నారు.

ఈ ఆస్పత్రి నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం 15 ఎకరాలను కేటాయించింది. క్యాన్సర్‌ వ్యాధిగ్రస్తులకు ఏపీలోనూ సేవలందించాలనే ఉద్దేశంతో ఈ ఆస్పత్రి నిర్మాణాన్ని చేపడుతున్నారు.

Leave a Comment