బాలయ్య అంబాని నామస్మరణ !

నందమూరి నట సింహం బాలకృష్ణ పుట్టకతోనే ఆగర్భ శ్రీమంతుడు. అటువంటి బాలయ్య పైసా కోసం అంబాని నామస్మరణ చేయడం ఎవరికైనా ఆశ్చర్యం కలిగించే విషయమే. బాలకృష్ణ హీరోగా ‘లెజెండ్’ సూపర్ సక్సస్ తరువాత సత్యదేవా01-10-20141412145096Nandamuri-Balakrishna-injured దర్శకత్వంలో నిర్మింప బడుతున్న కొత్త సినిమాకోసం ఈమధ్యనే బాలయ్యా త్రిషల పై ఒక రొమాంటిక్ గీతాన్ని రామోజీ ఫిలిం స్టూడియోలో చిత్రీకరించారు.  అయితే ఈ పాటలో బాలయ్య నోటి వెంట ప్రపంచ కుబేరుల లిస్టు లో ఉన్న అంబాని పేరు రావడం ఆశ్చర్యకరం ‘పైసా అంబాని పిల్లా’ అంటూ సాగే ఈ పాటలో బాలకృష్ణ నేటి యువ హీరోలకు ధీటుగా రొమాన్స్ చేసాడు అని అంటున్నారు ఈ ఫిలిం యూనిట్ వర్గాలు  ప్రజల సంక్షేమాన్ని కోరుకునే ఒక ఉన్నత ఉద్యోగి జీవితాన్ని కధా వస్తువుగా మార్చి మాస్ ప్రేక్షకులకు కావలసిన మసాల అంతా దట్టించి రూపొందుతున్న సినిమా ఇది అని అంటున్నారు.

 

లేటెస్ట్ గా ఫిలింనగర్ లో వినపడుతున్న వార్తల ప్రకారం ఈ సినిమా చిత్రీకరణ ఇప్పటికే చాల భాగం పూర్తి అయిన నేపధ్యంలో బాలకృష్ణ తనకు సెంటిమెంట్ గా కలిసి వచ్చే సంక్రాంతికి విడుదల చేయమని ఈ సినిమా నిర్మాతలకు సూచిస్తున్నట్లు టాక్. అయితే ఇప్పటికే సంక్రాంతి పై కన్నేసిన పూరి, జూనియర్ల కొత్త సినిమా బాలయ్య సినిమా కోసం వెనక్కు వెళుతుందా ? లేదంటే అబ్బాయి కోసం బాబాయి తన సెంటిమెంట్ ను కాదనుకుంటాడా అనే విషయం పై ఎవరి లెక్కలు వారికి ఉన్నాయి…

Leave a Comment