బాహుబ‌లి షూటింగ్ ఆగిపోయింది…

తెలుగు చ‌ల‌న చిత్ర‌సీమ సంక్షోభ ప‌రిస్థితుల‌ను ఎదుర్కొంటోంది. ఫెడరేష‌న్‌కీ, ఫిల్మ్‌ఛాంబ‌ర్‌కీ మ‌ధ్య నెల‌కొన్న వివాదం ఇప్ప‌ట్లో స‌మ‌సేలా లేదు. మా జీతాలు పెంచాల‌ని ఫెడ‌రేష‌న్‌, మా వల్ల కాద‌ని నిర్మాత‌లు కొన్ని రోజులుగా వాదించుకొంటున్నారు. దాంతో షూటింగుల‌కు అంత‌రాయం క‌లిగుతోంది. గోవా నుంచి షూటింగ్ క్యాన్సిల్ చేసుకొని ఎన్టీఆర్ బృందం తిరిగి రావ‌డానికి కార‌ణం ఇదే. బాహుబ‌లి షూటింగ్ మాత్రం య‌ధాత‌ధాంగా జ‌రిగేది. ఎందుకంటే బాహుబ‌లి టీమ్ త‌మ బృందానికి వేత‌నాలు పెంచింది. అయితే ఇప్పుడు బాహుబ‌లి షూటింగ్ కూడా ఆగిపోయింది. ఫెడ‌రేష‌న్ స‌భ్యులు. బాహుబ‌లి షూటింగ్‌నీ బ‌హిష్క‌రించాల‌ని పిలుపునివ్వ‌డ‌మే ఇందుకు కార‌ణం. సినిమాని బట్టి వేతనాలు అందుకోవ‌డం స‌రికాద‌ని, అంద‌రికీ ఒకే నియ‌మం వ‌ర్తించాల‌ని ఫెడ‌రేష‌న్ స‌భ్యులు వాదిస్తున్నారు. దాంతో రామోజీ ఫిల్మ్‌సిటీలో జ‌రుగుతున్న బాహుబ‌లి షూటింగ్ కూడా హ‌ఠాత్తుగా ఆగిపోయింది. ఈరోజు సాయింత్రం ఫెడ‌రేష‌న్ కీ, నిర్మాత మండ‌లికీ మ‌ధ్య కీల‌క‌మైన స‌మావేశం ఉంది. అక్క‌డ తీసుకొనే నిర్ణ‌యాల‌ను బ‌ట్టే.. షూటింగులెప్పుడ‌నేది తెలుస్తుంది.

Leave a Comment