భూ ఆక్రమణపై విచారణకు సిద్ధం

ponnalaహైదరాబాద్‌ (వి.వి) : తెలంగాణ రాష్ట్ర సమితి అధ్య క్షులు కె.చంద్రశేఖర్‌రావు తనపై చేసిన భూ ఆక్రమణ ఆరోపణలపై విచారణకు తాను సిద్ధంగా ఉన్నానని తెలంగాణ పిసిసి అధ్యక్షులు పొన్నాల లక్ష్మయ్య ప్రక టించారు. కెసిఆర్‌కు ధైర్యముంటే తనపై చేస్తున్న ఆరోపణపై ఆధారాలను చూపాలని పొన్నాల సవాల్‌ విసిరారు. లేకుంటే ఆయన ముక్కు నేలకు రాయాలని డిమాండ్‌ చేశారు. గాంధీభవన్‌లో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ తెలంగాణభవన్‌ను వ్యాపార సంస్థగా మార్చడమే కాకుండా ఉద్యోగులతో కెసిఆర్‌ వెట్టిచాకిరి చేయిస్తున్నారని ఆరోపించారు. సొంత సంస్థలో పని చేస్తున్నవారికి పిఎఫ్‌ ఇవ్వలేని కెసిఆర్‌ ఉద్యోగులపై మొసలి కన్నీరు కారుస్తున్నారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్‌ ఆధికారంలోకి వచ్చిన తర్వాత కెసిఆర్‌ అభియోగాలపై పూర్తి స్థాయిలో విచా రణ జరిపిస్తామని ఆయన స్పష్టం చేశారు. తాను కెసిఆర్‌ అంతటి సంపన్నుడని కాదని, ఉద్యమం పేరిట జరిగిన ఉప ఎన్నికల్లో నోట్లు దండుకోలేద న్నారు. క్రికెట్‌ బుకీలు, దొంగ పాస్‌పోర్టు వ్యవహారా లతో తనకు సంబంధం లేదన్నారు. కెసిఆర్‌ చెప్పేది ఒకటి చేసేది మరొకటని లక్ష్మయ్య దుయ్యబట్టారు. తెలంగాణలో ఒక్క ఓడరేవు లేదు. అయినా తనకు షిప్పింగ్‌ శాఖమంత్రి పదవి కావాలని కెసిఆర్‌ పట్టుబట్టారంటూ ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఆ మంత్రి పదవి కోసం ఆయన ఎందుకంత పట్టుబట్టారో అర్థం కావడం లేదన్నారు. కేంద్ర కార్మికశాఖ మంత్రిగా తెలంగాణ ప్రాంతానికి ఏం ఒరగబెట్టావంటూ కెసిఆర్‌ను లక్ష్మయ్య ప్రశ్నించారు. బీడి కార్మికుల సమస్యలపై కనీసం స్పందించలేదన్నారు.

Leave a Comment