మమ్మల్ని చూసి ఏడవకండి!

ఆంధ్రప్రదేశ్ విద్యా శాఖామంత్రి గంటా శ్రీనివాసరావు శనివారం హైదరాబాద్ లో విలేకరుల సమావేశంలో ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం అధికారం చేపట్టి ఐదు నెలలైనా ఇప్పటివరకు ప్రజలకు ఏమి చేసిందో చెప్పలేని దుస్థితిలో ఉందని తీవ్రంగా విమర్శించారు. అలాగే ఎంత సేపు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిని ఇతర మంత్రులను చూసి ఏడవడం కాదని, వారిని చూసి పని కూడా చెయ్యడం నేర్చుకోవాలని గంటా సూచించారు. ఆయన ఇంకా మాట్లాడుతూ రోజుకి 18గంటలు కష్టపడుతున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుపై అవాకులు, చవాకులు పేలడం మానేసి రాష్ట్ర అభివృద్దే లక్ష్యంగా తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ మరియు ఇతర మంత్రులు పనిచెయ్యడం మొదలుపెట్టాలని హితవు పలికారు. అలాగే పనీపాటా మానేసి ప్రజలను మభ్యపెడుతూ కూర్చుంటే ఏదో ఒక రోజు ముసుగులు తొలగిపోతాయని గంటా శ్రీనివాసరావు హెచ్చరించారు.

Leave a Comment