మరో మైలురాయి అందుకున్న ధోనీ

dhoni2

భారత క్రికెట్ జట్టు సారథి మహేంద్ర సింగ్ ధోనీ మరో మైలురాయి అందుకున్నాడు. ప్రపంచ కప్‌లో భాగంగా భారత్ – జింబాబ్వే మధ్య జరిగిన మ్యాచ్ ద్వారా ధోనీ అరుదైన రికార్డ్ అందుకున్నాడు. సచిన్ ఇప్పటి వరకు నాలుగు వందల మ్యాచుల మైలురాయి చేరుకున్నాడు. డిసెంబర్ 23, 2004లో బంగ్లాదేశ్ పైన ఆడిన మ్యాచుతో కెరీర్ ప్రారంభించాడు. ఇప్పుడు జింబాబ్వేతో జరుగిన మ్యాచుతో 400 అంతర్జాతీయ మ్యాచ్‌లు పూర్తి చేసుకున్నాడు. ఈ ఫీట్ సాధించిన ఆరో భారత బ్యాట్స్‌మెన్. ధోనీ వికెట్ కీపర్ కూడా కావడం గమనార్హం. ధోనీకి ముందు ఈ ఫీట్ సాధించిన వారిలో… మహమ్మద్ అజహరుద్దీన్, సచిన్ టెండుల్కర్, రాహుల్ ద్రావిడ్, అనిల్ కుంబ్లే, సౌరవ్ కంగూలీలు ఉన్నారు. ధోనీ భారత్‌కు.. ట్వంటీ 20 ప్రపంచకప్‌ను 2007లో, ప్రపంచ కప్‌ను 2011లో, ఛాంపియన్స్ ట్రోఫీని 2013లో అందించాడు.

జింబాబ్వేతో ఆడుతున్న మ్యాచ్ ధోనీది 260వ వన్డే. అతను 90 టెస్టులు, 50 ట్వంటీ 20లు ఆడారు. మొత్తం 400. ధోనీ గత ఏడాది డిసెంబర్ నెలలో టెస్టుల నుండి రిటైర్ అయ్యాడు. 400 అంతర్జాతీయ మ్యాచుల మైలు రాయి దాటిన వారిలో…

664 (200 Tests, 463 ODIs, 1 T20I) – సచిన్ టెండుల్కర్

509 (164 Tests, 344 ODIs, 1 T20I) – రాహుల్ ద్రావిడ్

433 (99 Tests, 334 ODIs) – మహమ్మద్ అజహురుద్దీన్

424 (113 Tests, 311 ODIs) – సౌరవ్ గంగూలీ

403 (132 Tests, 271 ODIs) – అనిల్ కుంబ్లే

400 (90 Tests, 260 ODIs, 50 T20Is) – మహేంద్ర సింగ్ ధోనీ

Leave a Comment