మలేషియాకు రూ.2099 మాత్రమే…

విమానాలనే కాదు, విమాన టికెట్ల ధరలను కూడా ఆకాశం నుంచి భూమ్మీదకు దించిన విమానయాన సంస్థ ఎయిర్ ఏషియా. త్వరలోనే హైదరాబాద్ నుంచి కూడా తన సేవలను ప్రారంభించబోతోంది. దేశీయంగా విమానయానం చేయాలనకునే ప్రయాణికులకు పలు విమానయాన సంస్థలు బంపర్ ఆపర్లను ప్రకటించడంతో.. ఇప్పటికే ఇబ్బిడిముబ్బడిగా ప్రయాణికులు టిక్కెట్లను బుక్ చేసుకున్నారు. విమాన సంస్థలు పోటీ పడుతూ మరి తక్కువ ధరలకే విమానయానాన్ని ప్రకటించిన నేపథ్యంలో జీవిత కాలంలో ఒక్కసారైన విమానం ఎక్కాలనుకునే ప్రయాణికుల కోరిక తీరుతుంది. అయితే రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి హైదరాబాద్ నుంచి మలేషియాకు నిత్యం సేవలను అందించనున్న ఎయిర్ ఏసియా విమానయాన సంస్థ.. మరో బంపర్ ఆఫర్ ను తీసుకోచ్చింది. ప్రారంభ ఆఫర్లో.. మొత్తం అన్ని పన్నులు కలుపుకొని కౌలాలంపూర్ నుంచి హైదరాబాద్కు కేవలం రూ. 2099కే టికెట్ ను విక్రయిస్తున్నారు. 01-10-20141412144613Air-Asia_2

 

ఈ ఆఫర్ కింద అక్టోబర్ 5 లోగా టికెట్లు బుక్ చేసుకోవాలని ఎయిర్ ఏసియా అధికారులు సూచించారు. సకాలంలో టిక్కెట్ బుక్ చేసుకున్న వారు డిసెంబర్ 8 నుంచి 2015 అక్టోబర్ 24 వరకు ప్రయాణాలు చేయొచ్చునన్నారు.. వారంలో అన్ని రోజులూ హైదరాబాద్ నుంచి మలేషియాకు విమానాలు నడిపించనుంది. హైదరాబాద్ నుంచి కౌలాలంపూర్కు డిసెంబర్ 8వ తేదీ నుంచి ఎయిర్ ఏషియా మలేషియా సేవలు ప్రారంభం అవుతాయని ఆ సంస్థ గ్రూప్ సీఈవో టోనీ ఫెర్నాండెజ్ ట్విట్టర్ ద్వారా తెలిపారు. ప్రస్తుతానికి కేవలం బెంగళూరు, చెన్నై, కొచ్చిన్, కోల్కతా, తిరుచిరాపల్లి నగరాల నుంచి మాత్రమే ఎయిర్ ఏషియా విమానాలు నడుస్తున్నాయి.

Leave a Comment