మావోయిస్టు గణపతి చుట్టూ బలగాలు రౌండప్?

సీపీఐ-మావో06-10-20141412588346imagesయిస్టు ప్రధాన కార్యదర్శి ముప్పాళ్ళ లక్ష్మణ్ రావు అలియాస్ గణపతి… దేశంలో నెంబరు 1 మోస్ట్ వాంటెడ్ నక్సల్ నేత. అటువంటి గణపతి తలపై రూ. 3 కోట్ల రివార్డు ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా ఛత్తీస్ గఢ్‌లోని అభూజ్ మాడ్ అడవుల్లో గణపతి ఉన్నట్లు సమాచారం తెలియడంతో భద్రత బలగాలు చుట్టుముట్టినట్టు తెలుస్తోంది. ఆయన తప్పించుకునే వీల్లేకుండా, అన్ని మార్గాలను దిగ్బంధించినట్టు సమాచారం. క్యాడర్‌తో సమావేశం నిర్వహించేందుకు గణపతి వస్తాడన్న నిఘా వర్గాల సమాచారం మేరకు భద్రత బలగాలను భారీ ఎత్తున రంగంలోకి దించారు. ఈ విషయమై మరింత సమాచారం అందాల్సి ఉంది. మావోయిస్టు అగ్రనేతగా ఎదిగిన గణపతి తుపాకీ పట్టకముందు ఉపాధ్యాయుడిగా పనిచేశారు. ఛత్తీస్ గఢ్, జార్ఖండ్, ఒడిశా, మహారాష్ట్రలను ఆనుకుని ఉన్న అడవుల్లో సంచరిస్తున్న గణపతి కోసం డజనుకు పైగా బృందాలు కూంబింగ్ ఆపరేషన్లలో పాలుపంచుకుంటున్నాయి.

Leave a Comment