మోడీ వ్యతిరేక వేడి

 

రాష్ట్ర ప్రభుత్వంతో తెగతెంపులు చేసుకున్న తర్వాత పలుమార్లు వాయిదా వేసుకుని నేడు ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల సన్నాహక సభకి వేంచేస్తున్న నరేంద్ర మోడీకి రాష్ట్రంలో తీవ్ర నిరసనలు స్వాగతం పలికాయి.

విభజన హామీలు అయిన ప్రత్యేక హోదా, లోటు నిధులు, వెనుకపడిన ప్రాంతాల ప్యాకేజ్, రైల్వే జోన్, రాజధాని నిర్మాణ సహాయం, పోలవరం ఆనకట్ట నిధులు, ఆస్తుల విభజన అంశాలలో చేయూత లేకపోగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తీవ్రమైన ఇబ్బందలు సృష్టిస్తున్న  గుజరాత్ ప్రధాని వెనక్కి పోవాలంటూ జాతీయ రహదారులపై హోర్డింగ్స్ ఏర్పాటు చేసి మరీ ఆంధ్రులు తమ  ఆగ్రహాన్ని వెళ్ల గక్కారు…

తెలుగుదేశం పార్టీ శ్రేణులు నల్ల దుస్తులు ధరించి నల్ల బెలూన్స్ ప్రదర్శిస్తూ నిరసన ప్రదర్శనలు నిర్వహించగా,…

కమ్యూనిస్ట్ , కాంగ్రెస్ పార్టీలు తమదైన శైలిలో ఖండనల ప్రకటనలు, కూడళ్లలో సభలు పెట్టి గొంతెత్తాయి.

పలు  ప్రజా సంఘాలు ఆంధ్ర హక్కుల కోసం వీధుల్లోకి వచ్చి “మోడి గో బాక్”  అంటూ గళమెత్తాయి. .

“ఆంధ్రలో bjp నాయకులు కన్నా లక్ష్మి నారాయణ, gvl నరసింహారావ్, సోము వీర్రాజు లను ఒక గదిలో పెట్టి తాళం వేసి ఎవరు ముందు బయటకి వస్తే వాళ్ళ మాటను లెక్కలోకి తీసుకోవాలి. ఒకళ్ళు ఆంధ్రకి 5  లక్షల కోట్లు ఇచ్చాం అంటే, మరొకరు 10  లక్షల కోట్లు అంటున్నారు,.మరొకరు వచ్చి 20 లక్షల కోట్లు ఇచ్చాం అంటారు,..ఈ రోజు మోడి వచ్చి 3 లక్షల కోట్లు ఇచ్చేశామ్ అన్నాడు,.. ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ 15,000 కోట్లు లెక్కతేలింది ఇస్తాము అంటాడు…bjp పార్టీకి మానవత్వం లేదు.. మన రాష్ట్రంలో అన్నీ పార్టీలకి కలిసి వచ్చే ఐకమత్యం లేదు” అంటూ ప్రత్యేక హోదా సాధన సమితి అధ్యక్షులు చలసాని శ్రీనివాస్ మండిపడ్డారు.

 

జనసేన పార్టీ నుండీ ఆంధ్ర కోసం  ప్రశ్నించే వాళ్ళే కనపడలేదు!

 .

కాగా, ఆంధ్రప్రదేశ్ ప్రధాన ప్రతిపక్షం ysr కాంగ్రెస్ పార్టీ ప్రతినిధులు “మోడీని ఎందుకు వ్యతిరేకిస్తున్నారు” అంటూ తెలుగుదేశం పార్టీని, ముఖ్యమంత్రి చంద్రబాబుని విమర్శిస్తూ ఎలక్ట్రానిక్ మీడియాలో చర్చలకు కూర్చోగా,.. రావాలి జగన్ కావాలి జగన్ పోస్టర్ లు ఉన్న ఆటోలు బి‌జే‌పి జెండాలతో సిద్ధమైన ఫోటోలు మీడియాలో చక్కెర్లు కొడుతున్నాయి!  ysr పార్టీ గుడివాడ నాయకుడు కొడాలి నాని తరఫున  ప్రధాని మోడీ కి ఘనస్వాగతం పలుకుతూ ఏకంగా గోడ పత్రికలు ప్రత్యక్షమవ్వటం కొసమెరుపు!

Leave a Comment