యువ హీరోకు మామిడి పళ్లు పంపించిన పవన్ కళ్యాణ్!

Pawan Kalyan-Nithiinహైదరాబాద్: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పంపిన బహుమతికి తబ్బిబ్బైన టాలీవుడ్ హీరో నితిన్ ఆనందంతో ట్విటర్ లో గంతులేశాడు. పవన్ కళ్యాణ్ మామిడి పళ్లను పంపించడమే నితిన్ ఆనందానికి కారణం.
‘టాలీవుడ్ లో పవన్ కళ్యాణ్ ను అమితంగా అభిమానించి హీరోల్లో నితిన్ ఒకరనే విషయం తెలిసిందే. నేను అభిమానించే పవన్ కళ్యాణ్ ఈ వేసవిలో మామిడి పళ్లను పంపించారు. పవన్ పంపిన మామిఢి పళ్లు చాలా రుచికరంగా ఉన్నాయి. థాంక్యూ సర్’ అంటూ సోషల్ మీడియా వెబ్ సైట్ ట్విటర్ లో సందేశంతోపాటు మామిడి పళ్ల ఫోటోలను పోస్ట్ చేశారు.

Leave a Comment