రచయిత్రిగా విద్యాబాలన్?

Actress Vidya Balanబాలీవుడ్‌లో టాప్‌మోస్ట్ హీరోయిన్లలో ఒకరుగా ప్రకాశిస్తున్న నటి విద్యాబాలన్. ది దర్టి పిక్చర్ చిత్రం ముందువరకు కుటుంబ కథా నాయకిగా పేరు తెచ్చుకున్న ఈ ముద్దుగుమ్మ ఆ చిత్రంలో తన అందాలను విచ్చలవిడిగా కుమ్మరించి గ్లామరస్ పాత్రల పోషణకు సరికొత్త భాష్యం చెప్పారు. అలాంటి విద్యాబాలన్ కహాని చిత్రంలో తప్పిపోయిన భర్తను వెతుక్కుంటూ వెళ్లే పాత్రలో జీవించారనే చెప్పాలి. తాజాగా ఈ సంచలన తార రచయిత్రిగా కొత్త అవతారమెత్తడానికి సిద్ధమవుతున్నట్లు సమాచారం.

కేరళకు చెందిన కమలదాస్ సంచలన రచయిత్రిగా పేరుగాంచారు. ఈమె బాల్య ప్రేమ లాంటి పలు ఇతివృత్తాలలో నవలలు రాసి సంచలనం సృస్టించారు. కమలదాస్ రాసిన మైస్టోరీ పుస్తకం పలు భాషల్లో అనువాదం కావడం విశేషం. కమలదాస్ కొంతకాలం తరువాత ఇస్లాం మతాన్ని స్వీకరించి కమల మరియాగా పేరు మార్చుకున్నారు.

ఈమె జీవిత చరిత్రను మళయాల దర్శకుడు కమల్ వెండితెరకెక్కించడానికి సిద్ధమవుతున్నారు. దీనిగురించి ఆయన మాట్లాడుతూ ఈ చిత్రం రచయిత్రి కమలదాస్ జీవిత చరిత్రగా కాకుండా ఒక రచయిత్రి భావోద్వేషాలను ఆవిష్కరించే చిత్రంగా ఉంటుందన్నారు. ఈ చిత్రంలో ప్రధాన పాత్ర పోషించడానికి విద్యాబాలన్‌ను సంప్రదించనున్నట్లు తెలిపారు.

Leave a Comment