రాజకీయాలొద్దు.. సహాయం చేయండి …

హుదూద్ తుపాన్ వల్ల తీవ్రంగా ఆస్తి నష్టం జరిగిందన్నారు ఎపీ సిఎం చంద్రబాబు. ముందస్తు చర్యలు తీసుకోవడం ద్వారా ప్రాణ నష్టం జరుగకుండా చూశామని చెప్పారు.ఎమ్మెల్యేలందరూ నియోజకవర్గ స్థాయిలో పరిస్థితిని సమీక్షించాలని సూచించారు. నగరంలోని ఆసుపత్రులకు సాయంత్రంలోగా విద్యుత్ పునరుద్దరిస్తామని .. తుఫాన్ బాధితులను అన్ని విధాల ఆదుకుంటామని అన్నారు. స్థానికంగా క్యాంపులు పెట్టి  బాధితులకు సాయం చేస్తామని.. రాజకీయం చేయకుండా అందరూ సహాయక చర్యల్లో పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు. తుపాన్ వల్ల మృతి చెందిన వారి కుటుంబాలకు 5లక్షలు, తీవ్రంగా గాయపడిన వారికి లక్ష సాయం అందిస్తామన్నారు. జనరేటర్ల ద్వారా నీటిని పంపింగ్ చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు.

Leave a Comment