రానా తో వర్మ సినిమా

గ్యాంగ్ స్టార్ కధలను తెరకెక్కించడం దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ట్రెండ్ సెట్టర్. సత్య, అంతం, గాయం, సర్కార్ లాంటి గ్యాంగ్ స్టార్ బ్యాక్  డ్రాప్ కధలను చూపించాడయన. ఇప్పుడు అలాంటి కధతోనే మరో సినిమా తీయబోతున్నాడు. ఈ సినిమాలో గ్యాంగ్ స్టార్ దగ్గుబాటి రానా. అవును.. వర్మ చెప్పిన ఓ  గ్యాంగ్ స్టార్ లైన్ కి రానా ఓకే చెప్పడం, ప్రీ ప్రొడక్షన్ పనులకు దిగిపోవడం చకచక జరిగిపోయట. ఈ చిత్రానికి ‘గొలుసు’ అనే టైటిల్ ను ని పరిశీలిసున్నట్లు టాక్. ఈ చిత్రాన్ని రమేష్ వర్మ – నవీన్ మాతి సంయుక్తంగా తెరకెక్కించబోతున్నారని సమాచారం. త్వరలోనే ఈ చిత్రంపై  అధికారిక ప్రకటన చేస్తారట. ప్రస్తుతం అపజయాల పరంపర కొనసాగిస్తున్న వర్మ, తనకు అచ్చొచ్చిన గ్యాంగ్ స్టార్ జోనర్లోనైనా ఓ హిట్ అందుకుంటారేమో చూడాలి.

Leave a Comment