రామ్గోపాల్ వర్మ రూట్ మార్చారా?

Ram Gopal Varmaభయం – దెయ్యం – రౌడీయిజం – ఫ్యాక్షనిజం ………వంటి హాట్ హాట్ చిత్రాలతో హడలెత్తించిన ప్రముఖ దర్శకుడు రామ్గోపాల్ వర్మ ఈసారి తన చిత్రం ద్వారా ప్రేక్షకులను కూల్ చేయనున్నారు. వైవిద్యమైన సినిమాలు తెరకెక్కించడంలో వర్మ సిద్దహస్తుడు. హర్రర్, టెర్రర్ చిత్రాలతో క్రియేటివ్ దర్శకుడుగా పేరుపొందిన ఆయన ఈ సారి తన ట్రెండ్ మార్చుకొని ఓ సాప్ట్ సినిమాను రూపొందిస్తున్నారు.

దేశంలోని అత్యంత ప్రతిభావంతమైన దర్శకులలో  రామ్ గోపాల్ ఒకరనడంలో ఎటువంటి సందేహంలేదు. ఆయన తన కేరీర్‌లో ఇప్పటి వరకు తెరకెక్కించిన సినిమాలన్నీ దాదాపు  రఫ్ స్టోరీలే. అయితే ఇప్పుడు ఆ
యన తన రూట్ మార్చుకున్నట్లుగా కనిపిస్తోంది. ఈ సినిమాతో ఆయన ప్రేక్షకులను కూల్ చేయనున్నారు. భీమవరం టాకీస్ బేనర్పై తుమ్మలపల్లి రామ సత్యనారాయణ  నిర్మించే ఈ చిత్రానికి ‘ఐస్ క్రీం’ అని అనే పేరుపెట్టిన విషయం తెలిసిందే. తను దర్శకత్వం వహించే చిత్రాలకు భిన్నమైన ఈ సినిమాను వచ్చే నెలలో  వర్మ ప్రేక్షకులకు చూపించనున్నారు.  ఈ టైటిల్ కూడా ఆయన గత చిత్రాలకు భిన్నంగా సాప్ట్గానే ఉంది.  ఈ మూవీలో  నవదీప్, తేజస్వి ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.

సినిమా రంగంలో ప్రయోగాలు చేయడంలో, అతి తక్కువ సమయంలో సినిమా పూర్తిచేయడంలో  వర్మ దిట్ట. ఫొటోగ్రఫీ, స్క్రీన్ప్లే…ఒక్కటేమిటి అన్ని రంగాలలో ప్రయోగాలు చేశారు. తన మొదటి సినిమా ‘శివ’తో ‘స్టడీకామ్’ అనే పరికరాన్ని సినిమా పరిశ్రమకు పరిచయం చేసిన వర్మ ఈసారి ‘ఐస్ క్రీమ్’ చిత్రం ద్వారా ‘ఫ్లోకామ్’ అనే మరో సరికొత్త పరికరాన్ని పరిచయం చేయబోతున్నారు. ‘ఫ్లోకామ్’ ను ఆసియాలోనే మొట్ట మొదటి సారిగా ‘ఐస్ క్రీమ్’ చిత్రం కోసం ఉపయోగిస్తున్నారు.

‘ఐస్ క్రీమ్’  టైటిల్ను బట్టి వర్మ రొటీన్‌ సినిమాలకు భిన్నంగా ఇది ఉంటుందని అనుకుంటున్నారు. అయితే ఈ సినిమా పోస్టర్లు, స్టిల్స్, ట్రైలర్ను చూస్తే వర్మ ముద్ర స్పష్టంగా కనిపిస్తోంది. ఆయన మరోసారి ప్రేక్షకులను భయపెట్టడతారన్న భావన వ్యక్తమవుతోంది. సినిమా విడుదలైతేగాని ఆయన రూటు మార్చారా? లేదా? అన్న విషయం తెలియదు.

Leave a Comment