రైల్వే ప్రాజెక్ట్ లను చేపట్టండి….

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టంలోని అంశాలను అమలు చేసేందుకు కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు కృషి చేస్తున్నారు. ఈ రోజు ఆయన కేంద్ర హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్, రైల్వే మంత్రి సదానందగౌడలను కలిశారు. చట్టంలో పేర్కొన్న వివిధ అంశాలను అమలు చేయాలని ఆయన వారికి విజ్ఞప్తి చేశారు. రెండు రాష్ట్రాల్లో రైల్వే ప్రాజెక్టులు సత్వరమే చేపట్టాలని ఆయన రైల్వే మంత్రిని కోరారు. విభజన చట్టం అమలును ఎప్పటికప్పుడు సమీక్షించాలని కేంద్ర హోం మంత్రి తన శాఖాధికారులను ఆదేశించారు.

Leave a Comment